యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.
అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘ఈ మూవీతో ఓ దర్శకుడి పుట్టుకను చూడబోతోన్నారు. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. శివ పార్వతులు, సతీ దేవీ, గంగా దేవీల్లాంటి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆర్జున్ అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. అర్జున్ కారెక్టర్‌లో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స కావాలి. మనిషి ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం,గట్స్ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశించే ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడుస్తోంది. వై? అనే క్వశ్చన్స్ లేకుండా వావ్ అని సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘లవ్ మీ ఇఫ్ యు డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
ఆశిష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చిన అరుణ్, నాగలకు థాంక్స్. మా చిత్రానికి మేజర్ అస్సెట్ అయిన పీసీ శ్రీరామ్, కీరవాణి గార్లకు థాంక్స్. టీజర్, ట్రైలర్ బాగుంటే సినిమాను చూస్తారు. కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి. చీకటి రూం అంటేనే నాకు భయం. అలాంటి నన్ను స్మశానంలోకి తీసుకెళ్లారు. వైష్ణవి, రవి అందరితో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు హర్షిత్ అన్న, హన్షిత అక్క, దిల్ రాజు గార్లకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘స్కల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఈ మూవీకి తక్కువ రోజులే పని చేసినా వైష్ణవి, ఆశిష్‌లు ఫ్యామిలీ మెంబర్స్‌లా మారిపోయారు. మే 25న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
రవికృష్ణ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష చేసిన టైంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ మూవీకి చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. వైష్ణవి, ఆశిష్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మే 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…