ధూం ధాం సినిమా మీ టికెట్ ధరకు విలువైన వినోదాన్ని అందిస్తుంది సాయికిషోర్ మచ్చా

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో “ధూం ధాం” సినిమా హైలైట్స్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా.

  • నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశాను. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశాం. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్ ను లీడ్ చేశాను. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన బృందా సిరీస్ కు వర్క్ చేశాను. ఇలా మూవీస్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో రైటర్ గోపీమోహన్ గారు “ధూం ధాం” సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది.
  • మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూరప్ లో షూటింగ్ చేద్దామని పోలెండ్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ చిత్రీకరణ జరిపాం. పోలెండ్ లో కూడా మాకు ఇండియా ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే.
  • తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.
  • ఈ మధ్య మనం థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ మూవీస్ చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్ టైన్ మెంట్ “ధూం ధాం” సినిమాలో చూస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి మైత్రీ నవీన్ గారు మంచి ఫ్రెండ్. అలా కాంటాక్ట్ అయి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.
  • హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో నటుడిగా మంచి టైమింగ్ ఉంది. తండ్రి కోసం కొడుకు పడే ఒక ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్ లో చేతన్ బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబా పటేల్ కూడా తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించింది. సెట్ లో కూడా తను చాలా యాక్టివ్ గా ఉండేది.
  • “ధూం ధాం” సినిమాలో సాయి కుమార్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ వంటి కాస్టింగ్ ఉంది. వీరితో పాటు రామజోగయ్య శాస్త్రి గారు, గోపీ సుందర్, మంగ్లీ స్క్రీన్ మీద మెరుస్తారు. ఇంతమంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నా.. హీరోకున్న ప్రత్యేకత కథలో అలాగే ఉంటుంది. రామజోగయ్య శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాశారు. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్. రీసెంట్ టైమ్స్ లో “ధూం ధాం” వంటి ఛాట్ బస్టర్ ఆల్బమ్ రాలేదు. రామజోగయ్య గారికి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సన్మానం చేస్తున్నాం.
  • “ధూం ధాం” సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. రీసెంట్ గా వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్ లో దాదాపు ప్రతి సీన్ కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈనెల 8వ తేదీన అన్ని థియేటర్స్ నుంచి ఇలాంటి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం.
Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago