చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ పాట ఛాట్ బస్టర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. తాజాగా “ధూం ధాం” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మాయా సుందరి..’ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ‘మాయా సుందరి..హే మాయా సుందరి..నా మాయా సుందరి..ఎక్కడున్నావో మరి..గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగుతుందీ పాట. హీరో పాడుకునే లవ్ సాంగ్ గా ‘మాయా సుందరి..’ పాటను స్టైలిష్ గా రూపొందించారు.
నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…