టాలీవుడ్

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా టీజర్ రిలీజ్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మారుతి “ధూం ధాం” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ చాలా బాగుందని చెప్పిన మారుతి, మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.

హీరో హీరోయిన్లు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ లవ్ స్టోరీతో “ధూం ధాం” సినిమా టీజర్ ప్రారంభమైంది. ఈ లవ్ స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చేతన్ కృష్ణ చేసిన విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ పెళ్లి సందడిలో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీ..ఇలా థియేటర్ లో ప్రేక్షకుడు చూసి ఎంజాయ్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో “ధూం ధాం” టీజర్ ఇంప్రెస్ చేస్తోంది.

నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా

Tfja Team

Recent Posts

‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’

భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా టాక్సిక్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా…

1 week ago

Yash’s ‘Toxic: A Fairy Tale for Grown-Ups

Or Yash's ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ Breaks Barriers as the First Indian Film…

1 week ago

Hari Hara Veera Mallu Second Single An Instant Chartbuster

The much awaited second single from Powerstar Pawan Kalyan’s upcoming magnum opus Hari Hara Veera…

1 week ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'.…

1 week ago

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్…

1 week ago

Dance IKON Season 2 turns into revenge-fueled battle as nominations heat up

HYDERABAD – The second episode of Dance IKON Season 2: Wildfire delivered an unexpected twist,…

1 week ago