టాలీవుడ్

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న విడుదల

ప్రశాంత్ వర్మ కథతో పెద్ద స్పాన్ వున్న దేవకీ నందన వాసుదేవ సినిమా చేయడం అధ్రుష్టంగా భావిస్తున్నా : అశోక్ గల్లా

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

ఆదివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అశోక్ గల్లా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుండగా, ఒక వైపు సాధువు, మరొక వైపు అంత శక్తివంతమైన గెటప్ లో మనం చూడవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మనం చూడవచ్చు.

సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని టీజర్‌లో తేలింది. మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బాలక్రిష్ణ మాట్లాడుతూ, మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు రిలీజ్ లున్నాయి. అవి వచ్చినా సరే మా సినిమా మాదే. మాది సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. మేం కొత్తవాళ్లమే అయిన మంచి ఔట్ పుట్ తో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాం. థియేటర్ లో సినిమా చూశాక మంచి సినిమా తీశామనే ఫీలింగ్ మీకూ కలుగుతుంది. ఇక ప్రశాంత్ వర్మ కథ గురించి తెలిసిందే. సరికొత్త ఐడియాతో ఆయన రాశారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఆకట్టుకునేలా మంచి బాణీలు ఇచ్చారు. మాటల్లో పదునైనవిగా సాయిమాధవ్ రాశారు. దర్శకుడు ఫర్ ఫెక్ట్ గా సినిమాను చేశారు. నవంబర్ 14న సినిమా విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

కథానాయిక మానస మాట్లాడుతూ, గత ఏడాది ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది. ఈరోజు విడుదలకు దగ్గరైంది. నా మొదటి సినిమాలో సీనియర్స్ తో నటించడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇందులో నా పాత్రపేరు సత్యభామ. అందుకే పాత్రకు కనెక్ట్ అయ్యాను. తనకు ఎలాంటి ఒత్తిడిలు వున్నా ధైర్యంతో ముందుకుసాగే పాత్ర అది. కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందించారు. అందరినీ అలరించేదిగా వుంటుందని నమ్ముతున్నాను అన్నారు.

దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ, గొప్ప చిత్రం చేశానని చెప్పగలను. ప్రశాంత్ ఇచ్చిన కథ యూనిక్ స్టయిల్ లో వుంది. కథ ఇచ్చాక సోల్ దెబ్బతినకుండా మీకు నచ్చిన రీతిలో చేయమని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పక్కా కమర్షియల్ తో కూడిన సినిమాగా తీశాం. ఇంతకు పూర్వం కూడా ఇలాంటి కథ రాలేదు. మురారి సినిమాతో భీమ్స్ పోల్చారు. అంతకుమించినదిగా వుంటుందని చెప్పగలను. రసూల్ కెమెరా, ఫైట్స్ సినిమాకు ఆకర్షణ అయితే, అశోక్ టాప్ రేంజ్ హీరోలా చేశాడు. ఆదిపురుష్ లో నటించిన దేవదత్త నాగ్ కూడా బాగా నటించారు. మానస చాలా సహకరించి సినిమా బాగా వచ్చేలా నటించింది. మొదటినుంచి హిట్ సినిమా చేయాలని పట్టుదలతో తీశాం. అన్నారు.

హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, ఇది నాకు రెండో సినిమా. ముందుగా ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కథ అంటే ఆడియన్ కు ఏదో గట్టి కథ వుంటుందని గ్రహించేస్తారు. ఈ కథలో సోల్ చాలా డెప్త్ గా వుంటుంది. ఇంత కమర్షియల్ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇక మానసకు చాలెంజింగ్ రోల్. ఈ సినిమా తర్వాత ఆమె స్థాయి పెరుగుతుంది. నవంబర్ 14న సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

అనంతరం విలేకరుల అడిగిన పలు ప్రశ్నలకు నటీనటులు ఇలా సమాధానమిచ్చారు.

దర్శకుడు: గుణ 369 అనేది ఓ సందేశంలో తీశాను. ఈ సినిమా సత్ సంకలత్పంతో శక్తి వైబ్రేట్ అ యి మనకు ఎలా హెల్ప్ చేస్తుందనే సందేశం ఇందులో చెప్పాం. టైటిల్ లో వాసుదేవ ఎందుకు పెట్టామంటే బ్యాక్ డ్రాప్ క్రిష్ణుడు కనిపిస్తాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టేలా కథ కుదిరింది. డివైన్ ఫీల్ ఈ సినిమాలో వుంది. సినిమా ఆరంభంనుంచి ముగింపు వరకు ప్రతి పాత్రా హైలైట్ అయ్యేలా వుంటుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాను.

మానస మాట్లాడుతూ, ఈ సినిమాలో డాన్స్ కూడా బాగా చేశాను. మిస్ ఇండియా నేపథ్యం కాబట్టి ఆ ఫార్మెట్ నుంచి బయటకు వచ్చి సినిమాలో డాన్స్ చేయడం నాకు ఛేంజ్ గా అనిపించింది. కాలేజీ నుంచి మోడలింగ్ చేశాను. మిస్ ఇండియా నుంచి సినిమా అనే మరో లోకంలోకి వచ్చాను. చిన్నతనం నుంచి క్యూరియాసిటీ వుండేది. సినిమా కోసం పలు వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా పరంగా అర్జున్ గారే నా గురువు. పాత్రను అద్భుతంగా మలిచారు.

హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, నేనున్న పరిస్థితికి మంచి సినిమాలు చేయాలి. పేరు చెడగొట్టకూడదు. కష్టపడి చేయాలి. అది సినిమాలో కనిపిస్తుంది. కథ విన్నప్పుడు బాగా నచ్చేసింది. పెద్ద స్పాన్ వున్న కమర్షియల్ సినిమా నాకు రెండో సినిమాగా రావడం చాలా హ్యాపీగా వుంది. డాన్స్ అనేది నేర్చుకుని బాగా చేశాను. ఇది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగేకథ. గెటప్స్ కూడా వినూత్నంగా వేయించారు. ఇందులో నాపేరు క్రిష్ణ. అమ్మచెబితే ఏదైనా చేసే కుర్రాడు. దేవుడిపై వున్న నమ్మకంకూడా అలాంటిదే. స్వేచ్ఛ కోరుకునే కుర్రాడి కథ. మహేష్ బాబు టీజర్ చూశాక, బాగుందని కితాబిచ్చారు.

ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది, దీనికి కథను హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు, ప్రశంసలు పొందిన సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.

ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల మరియు రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకుడు: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ : నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
PRO: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

“కిల్లర్” మూవీ మోషన్ గ్రాఫిక్ పోస్టర్ లాంఛ్

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో…

2 hours ago

Killer starring Jyothi Poorvaj, motion graphic poster launched

Jyothi Poorvaj, the heroine who has starred in numerous hit serials and films, has become…

2 hours ago

Manmadha is rushing with collections even in re-release

Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine,…

3 hours ago

రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్…

3 hours ago

Mr. Idiot trailer and Kanthara Kanthara Song Celebrations

"Mr. Idiot" features Maadhav, the son of Mass Maharaja Ravi Teja's younger brother, Raghu, with…

3 hours ago

“మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా ట్రైలర్ కాంతార కాంతార సాంగ్ సెలబ్రేషన్స్

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్…

3 hours ago