డెలివరీ బాయ్ చేతుల మీదుగా విడుదల చేసిన దేవ్ పారు చిత్రం పోస్టర్

ఏకే ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న దేవ్ పారు చిత్రం తాజాగా పోస్టర్ లాంచ్ జరిగింది. ఈ పోస్టర్ లాంచ్ వేడుక చాలా వినుత్నంగా జరిగింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే డెలివరీ బాయ్ చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం విశేషం. తన విలువైన సమయాన్ని పోస్టర్ అవిష్కరణకు వినియోగించినందుకు దేవ్ పారు చిత్ర యూనిట్ డెలివరీ బాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేశారు.

అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బాయ్స్ ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారని వారి శ్రమకు దేవ్ పారు టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసీ, ఆహారం తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌తో పోస్టర్ లాంచ్ చేశారు. వీరి ఐడియాకు నెటిజనులు ఫిదా అయిపోతున్నారు. పోస్టర్ లాంచ్‌ను వినుత్నంగా ఆవిష్కరించడమే కాకుండా ఇలాంటి సామాజిక బాధ్యతను అందరికి గుర్తుచేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు ముచ్చటించుకుంటున్నారు.

దీంతో అందరూ దేవ్ పారు పోస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సామాన్యుడిని సెలబ్రేటీ చేసిన దేవ్ పారు టీమ్ పోస్టర్ లాంచ్‌లోనే ఇలాంటి ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే ఇంకా ప్రమోషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో, సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది. కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, త్వరలోనే మరో సాలిడ్ అప్డేట్‌తో వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

చిత్రం: దేవ్ పారు
ఎగ్జ్‌గ్యూటీవ్ ప్రొడ్యూసర్: ప్రియా అండలూరి
ప్రొడక్షన్ మేనజర్: మెహర్ మోనిష్
ఆర్ట్ డైరెక్టర్: సాయి కధిర
కాస్ట్యూమ్ డిజైనర్: పరమేశ్వర్ కృష్ణ
లిరిక్స్: రఘురామ్
కలరిస్ట్: వి చిట్టకాంగ్
డీఓపీ: అశ్విన్ అంబేద్
మ్యూజిక్: ఓషో వెంకట్
ఎడిటర్: ప్రతీక్ నూటి
పీఆర్ఓ: హరీష్, దినేష్
నిర్మాత: లోడీ ఫాహద్ అలీఖాన్
రచయిత, దర్శకత్వం: అఖిల్ రాజ్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago