ఆగ‌స్ట్ 30న దేవ్ హీరోగా ‘అహో! విక్రమార్క’ గ్రాండ్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ కథానాయకుడిగా  దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’.

పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 30న భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ, కన్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.  రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే హీరో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ దేవ్ విల‌న్‌కు గ‌ట్టి పంచ్ ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా…

హీరో దేవ్ మాట్లాడుతూ ‘‘‘అహో! విక్రమార్క’తో,  పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం.  సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 30 పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు’’ పేర్కొన్నారు.

దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క’ సినిమా పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం రూపొందించాం. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. దేవ్ ‌ను స‌రికొత్త‌గా చూస్తారు. ఆగ‌స్ట్ 30న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:  దేవ్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాతలు : ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా.
దర్శకత్వం : పేట త్రికోటి
కథ :పెన్మెత్స ప్రసాద్ వర్మ
సంగీతం : రవి బస్రూర్ మరియు ఆర్కో ప్రవో ముఖర్జీ
కెమెరా మెన్ : కరమ్ చావ్లా, గురు ప్రసాద్. ఎన్
ఎడిటర్ : తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
స్టంట్స్: రియల్ సతీష్
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

6 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago