‘ప్రాజెక్ట్ K’ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ విడుదల

వైజయంతీ మూవీస్ సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ K’ నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ సంచలనాల్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా నిలిచింది.

శాన్ డియాగో కామిక్-కాన్‌లోని ఐకానిక్ హెచ్ హాల్‌లో గ్రాండ్ లాంచ్ అవుతున్న ‘ప్రాజెక్ట్ K’ లో ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మల్టీలింగ్వల్ మూవీ గ్రౌండ్ బ్రేకింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించే భరోసా ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సెపియా-టోన్డ్ విజువల్‌లో ఆమె ఇంటెన్స్ ఓరతో ఆకట్టుకుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమా కథనంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యూవర్స్ లో కలిగిస్తుంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ని అద్భుతంగా రూపొందించి సైన్స్ ఫిక్షన్ గ్రిప్పింగ్ డ్రామాతో కలిసే ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. భారీ తారాగణం, బ్రెత్ టేకింగ్ విజువల్స్, సరిహద్దులను అధిగమించే స్క్రిప్ట్‌తో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్  K’.. రిలీజ్ కోసం అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

జనవరి12, 2024న థియేటర్లలో విడుదల కానున్న ‘ప్రాజెక్ట్ K’ ఇండియన్ సినిమాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, సైన్స్ ఫిక్షన్ జోనర్ ని రీడిఫైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభిమానులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్‌లుక్‌ వారు ఎదురుచూస్తున్న స్పెల్ బైండింగ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక అద్భుతమైన గ్లింప్స్ లా ఆకట్టుకుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago