ఘనంగా ప్రారంభమైన దీపా ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నం1 చిత్రం ‘ ‘‘ఇరువురు భామల కౌగిలిలో’’….

దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్‌ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస గౌడ్‌ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’ . పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రినా«ద్‌ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు.

చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్ర ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్వ్రే్కర్‌ దర్శకుడు మల్లిక్‌రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం– శీను భీట్స్, డిఓపి– శశాంక్‌ శ్రీరామ్, మాటల రచయిత– శ్రీధర్‌ సీపాన, ఎడిటర్‌– రాఘవేంధ్ర వర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌– సౌజన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– సాయిరామ్‌ దేవర్ల, ప్రొడక్షన్‌ డిజైనర్‌– షర్మిలా కొప్పిశెట్టి, కాస్టూమ్స్‌– ప్రణతి, పి.ఆర్‌.ఓ– శివమల్లాల, నిర్మాత– శ్రీనివాస గౌడ, దర్శకత్వం– అచ్యుత్‌ చౌదరి.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago