మొద‌లైన‌ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ బుకింగ్స్

మార్వెల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే చాలు, ప్రపంచ‌వ్యాప్తంగా ఈ సినిమాల్లో క‌నిపించే సూప‌ర్ హీరోల అభిమాన‌లకి సంబ‌రాల్లో మునిగితేలుతుంటారు. మార్వెల్ యూనీవ‌ర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ రిలీజ్ కి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్ యూట్యూబ్ లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ అందుకోవ‌డంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్ తో పాటు వాల్వ‌రిన్ కూడా వెండితెర పై అద్భుత విన్యాసాలు చేయ‌బోతున్నాడు.

ఇద్ద‌రు సూప‌ర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేప‌థ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ మోస్ట్ ఫెవ‌రేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైద‌ర‌బాద్ లో మార్వెల్ సినిమాలు అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇటీవ‌లే డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టికెట్లు బుకింగ్ మొద‌లైన సంద‌ర్భంగా త‌మ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ చాటుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్ వీడియోలు ప్ర‌స్తుతం నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వ‌రిన్ లో ప్ర‌ధాన‌పాత్ర‌ధారులుగా ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ న‌టిస్తున్నారు. జూలై 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో డెడ్ పుల్ & వాల్వ‌రిన్ విడుద‌ల‌వ్వ‌నుంది.

Tfja Team

Recent Posts

“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

అందరి ఫేవరెట్ సూపర్ హీరో 'స్పైడర్-మ్యాన్' కొత్త సినిమా "స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" నుండి రెండు అద్భుతమైన పోస్టర్లను…

19 minutes ago

జో శర్మా ప్ర‌ధాన పాత్ర‌లో, మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌క‌త్వంలో‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

హైదరాబాద్: జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for…

23 minutes ago

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

1 day ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

2 days ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

6 days ago