“డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో – ప్రెస్ మీట్ లో హోస్ట్ ఓంకార్

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రెస్ మీట్ ను ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ – డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో మీకు తెలుసు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” మిమ్మల్ని డెఫనెట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. నేను సినిమాకు వర్క్ చేశా టీవీకీ వర్క్ చేశా. ఏ ప్లేస్ లో వర్క్ చేసినా ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉండేలా చూసుకుంటా. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో . అన్నారు.

హోస్ట్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 టైమ్ లో కూడా నన్ను హోస్ట్ గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల సీజన్ 1 చేయలేకపోయాను. ఇప్పుడు “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో హోస్ట్ గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఓంకార్, శేఖర్ మాస్టర్ తో కలిసి హోస్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఆ కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా. ఓంకార్ గారు చెప్పినట్లు ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. నలుగురు మెంటార్స్ నిజంగా వైల్డ్ ఫైర్ లా షో చేశారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” మీకు కంప్లీట్ ఎంటర్ టైంట్ ఇస్తుందని గ్యారెంటీగా చెప్పగలను. నేను హీరోయిన్ గా సినిమాలు చేయడాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తానో అలాగే ఇలాంటి షోస్ చేయడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. అన్నారు.

హోస్ట్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 ను పెద్ద సక్సెస్ చేశారు. ఇప్పుడు “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” మీ ముందుకు వస్తోంది. మూవీస్ బిజీలో ఉండటం వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోయాను. నేను జడ్జ్ గా చేస్తున్నా…మేము కూడా సర్ ప్రైజ్ చేసేలా డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లు ఉంటాయి. ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది. ఆహాలో ఈ నెల 14 తేదీ రాత్రి 7 గంటల నుంచి అదిరిపోయే పర్ ఫార్మెన్స్ ల కోసం “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” చూడండి. అన్నారు.

మెంటార్ యష్ మాస్టర్ మాట్లాడుతూ – డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఆడియెన్ ను ఆకట్టుకుంటుంది. ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే చేసుకుని మా “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”షోను చూడండి. ఫిబ్రవరి 14 నుంచి మిమ్మల్ని “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” ఎంటర్ టైన్ చేయబోతోంది. అన్నారు.

మెంటార్ మానస్ మాట్లాడుతూ – “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చిన ఓంకార్ అన్నయ్యకు థ్యాంక్స్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 బిగ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సీజన్ 2 కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఓంకార్ గారు. ఆయనకు ఆడియెన్స్ పల్స్ తెలుసు. వన్ సెకండ్ అంటూ ఎలా ఉత్కంఠకు గురి చేస్తారో మీరంతా చూశారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో ఎన్నో థ్రిల్స్, సస్పెన్స్ లు ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కే మాకు సినిమా కనిపించింది. ఫిబ్రవరి 14 నుంచి ఆహాలో “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” చూడండి. అన్నారు.

సింగర్ జాను లైరి మాట్లాడుతూ – ఫోక్ సాంగ్స్ అంటే కొందరిలో చిన్నచూపు ఉండేది. కానీ నన్ను ఆ జానపద గీతాలే ఈ వేదిక దాకా తీసుకొచ్చాయి. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” మెంటార్ గా ఉండే అవకాశం కల్పించిన ఓంకార్ గారికి థ్యాంక్స్. మెంటార్ గా చేయాలంటే గట్స్ ఉండాలి, ఏదైనా చెప్పగలిగే ధైర్యం ఉండాలి. నాకు అలాంటి అవకాశం “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” షోతో దొరికింది. ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ నేను ఎక్స్ పెక్ట్ చేయలేకపోయాను. అంత బాగా చేశారు. మీరంతా “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”షో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

మెంటార్ ప్రకృతి మాట్లాడుతూ – “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” షోలో మెంటార్ గా ఉండే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నా పుట్టినరోజున ఈ కాల్ వచ్చింది. మెంటార్ గా చేయాలి అన్నప్పుడు నమ్మలేకపోయాను. నేను ఫెమీనా మిస్ తెలంగాణగా ఎంపికయ్యాను. అయితే మోడలింగ్ కు ఈ డ్యాన్స్ షో మెంటార్ గా ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”ను అర్థం చేసుకునే క్రమంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఏపీ, తెలంగాణ అని కాదు దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ మిమ్మల్ని తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. అని చెప్పింది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

7 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago