ఓషో తులసీరామ్, సాయి ధన్సికల ‘దక్షిణ’ చిత్రీకరణ పూర్తి 

Must Read

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ‘. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది.  

చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ”ఇదొక సైకో థ్రిల్లర్. సినిమా అంతా భావోద్వేగాలదే ప్రధాన పాత్ర. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారి పాత్ర చేశారు. పవర్‌పుల్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించారు. ‘దక్షిణ’ విడుదల తర్వాత ఆమెకు మరింత పేరు వస్తుంది. హైదరాబాద్, విశాఖపట్టణం, గోవాల్లో చిత్రీకరణ చేశాం. మొత్తం 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాల తరహాలో ‘దక్షిణ’ కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది” అని చెప్పారు. 

సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్. 

Latest News

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్...

More News