మే 17న రానున్న భరత్, వాణి భోజన్‌ హారర్ చిత్రం ‘మిరల్’

Must Read

ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

శ్రీమతి. జగన్మోహిని & జి డిల్లి బాబు సమర్ఫణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు.

Miral Official Telugu Trailer | Bharath, Vani Bhojan, K.S.Ravikumar | Vigneswara Entertainments

నటీనటులు : భరత్, వాణి భోజన్, K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్పణ : శ్రీమతి. జగన్మోహిని & జి డిల్లి బాబు
నిర్మాత : సిహెచ్ సతీష్ కుమార్
దర్శకుడు: ఎం శక్తివేల్
కథ-స్క్రీన్ ప్లే: ఎం శక్తివేల్
మ్యూజిక్ కంపోజర్: ప్రసాద్ ఎస్ ఎన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ బాలా
ఎడిటర్: కలైవానన్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: మణికందన్ శ్రీనివాసన్
యాక్షన్ కొరియోగ్రఫీ : డేంజర్ మణి
కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీదేవి గోపాలకృష్ణన్
కాస్ట్యూమర్: M మొహమ్మద్ సుబియర్
మేకప్: వినోద్ సుకుమారన్
VFX సూపర్‌వైజర్: కిరణ్ రాఘవన్ (రెసోల్ FX)
ఆడియో : థింక్ మ్యూజిక్
PRO : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News