“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాలోని ఫ్రెష్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది – ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిత్ర అనే క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మిత్ర క్యారెక్టర్ తో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర కూడా నాలాగే లైఫ్ లో ఏదైనా చేయాల్సివస్తే ముందు యాక్షన్ లోకి దిగేస్తుంది. ఎలాంటి డౌట్స్ పెట్టుకోదు. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ. మేము చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గెరిల్లా టైప్ లో షూటింగ్ చేశాం. సంతోష్ శోభన్ చాలా మంచి యాక్టర్. ఆయన డెడికేషన్, ప్రతి సీన్ లో ఇంకా బాగా నటించాలనే తపన చూశాను. నేను ఆయన నుంచి నేర్చుకున్నా. ఆదిత్య బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఛాట్ బస్టర్స్ అయ్యాయి. నా ఫేవరేట్ సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయాల్సిఉంది. మా సినిమాను ధీరజ్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ప్రొడ్యూస్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నా ఫేవరేట్ మూవీ. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా కపుల్స్ కోసమే కాదు సింగిల్స్, కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మీ అందరికీ “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ ట్రైలర్ నచ్చిందని నమ్ముతున్నాను. నిజాయితీ గల ఒక టీమ్ నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ సంతోష్ శోభన్ గారు చూశారు. ఆయనకు నేను ఈ మూవీ స్క్రిప్ట్ పంపాను. స్క్రిప్ట్ చదివిన వెంటనే ఈ మూవీ చేద్దామని ఓకే చేశారు. అలా “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. నేను షార్ట్ ఫిలింస్ చేసినప్పటి నుంచి డీవోపీ దినేష్, ఎడిటర్ గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య ఫ్రెండ్స్. నేను ఫస్ట్ మూవీ చేసేప్పుడు ఈ ముగ్గురు నా మూవీలో ఉండాలనుకున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అనే ఫీల్ మీ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతో పాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నాను. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – యూవీ క్రియేషన్స్ అంటే ఎంతో ప్యాషనేట్ గా మూవీస్ చేసే ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ జర్నీ ఇన్స్ పైర్ చేస్తుంటుంది. ఈ రోజు వారితో కలిసి సినిమా చేస్తుండటం గర్వంగా ఉంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నేను చూశాను. ఇంటర్వెల్ వరకు చూసేప్పటికే ఈ సినిమా మనసుకు హత్తుకుంది. సినిమా కంప్లీట్ గా చూశాక మూవీ అదిరిపోయింది అంటూ చాలా మందికి కాల్స్ చేసి చెప్పాను. డైరెక్టర్ ను కలుద్దామని అనుకుంటే ఆయన చెన్నైలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమా చూసిన ఫీల్ లో చాలా రోజులు ఉండిపోయాను. సంతోష్ శోభన్ సినిమా అంతా సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చేశారు. ఆయన పర్ ఫార్మెన్స్ చూస్తుంటే ఒక్కో సీన్ లో కన్నీళ్లు వచ్చాయి. మానస వారణాసి తెలుగమ్మాయి. ఈ మూవీలో బాగా నటించింది. మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. కానీ ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త తరహా ప్రేమ కథలు రావాలి. “కపుల్ ఫ్రెండ్లీ” బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సంతోష్ శోభన్ స్టార్ అవుతారు. అన్నారు.

కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. మా యూవీ సంస్థలో చేసిన మరో మంచి లవ్ స్టోరీ మూవీ ఇది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. ధీరజ్ మాతో గతంలో కలిసి వర్క్ చేశారు. మా సినిమాలను రిలీజ్ చేశారు. ఆయనకు ఈ సినిమాను మేమే చూపించాం. సినిమా చూశాక చాలా బాగుంది అన్నా, నేను మొత్తం తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను అన్నారు. మా మధ్య మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఆయనకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – యూవీ క్రియేషన్స్ నా ఫ్యామిలీ లాంటిది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా మాది అనుకుంటాం. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చేయబోయే ఎన్నో మంచి చిత్రాల్లో మొదటిదిగా “కపుల్ ఫ్రెండ్లీ” రిలీజ్ కు వస్తోంది. ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించి పేరు తీసుకొచ్చింది మానస వారణాసి. ఆమెతో కలిసి ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. మా సినిమాలో మిత్ర క్యారెక్టర్ ను ఆమె కంటే బెటర్ గా ఎవరూ చేయలేరేమో అనిపించింది. మా అజయ్ అన్నకు థ్యాంక్స్. ధీరజ్ గారు మా మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మా టీమ్ అందరిలో పది రెట్లు ఉత్సాహం వచ్చింది. నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట నిజమే. ఈ సారి నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్ కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా. శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. చెన్నైలో షూటింగ్ చేయడం బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. “కపుల్ ఫ్రెండ్లీ” ఒక జెన్యూన్ ఇంటెన్షన్ తో, హానెస్ట్ గా చేసిన సినిమా. ఇది నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

TFJA

Recent Posts

క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వింటర్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ,…

2 hours ago

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో హ్యూజ్ రెస్పాన్స్ సాధిస్తున్న విజయ్ దేవరకొండ “రణబాలి” టైటిల్ గ్లింప్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

4 hours ago

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "దక్షిణ కాళీ". హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి…

5 hours ago

ఆహా ఓటీటీలో 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ

ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ 'శంబాల' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి అద్భుత ఆదరణ…

5 hours ago

‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆది సాయి కుమార్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్,…

5 hours ago

‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ.…

5 hours ago