సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను కూడా గ్రాండ్ గా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ‘నాలో నేను..’, ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. యూత్ ఆడియెన్స్ “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా చూసేందుకు క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు
టెక్నికల్ టీమ్
ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

