”అరే.. స్టాక్స్ ఉదమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది” అని అంటున్నారు టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ అనిల్ రావిపూడి. ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనిల్ రావిపూడి. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది. ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్ చేసేది కామెడీనే. ఈ నవంబర్ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ నవంబర్ నుంచి మొదలు కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’లో చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ వంటివాళ్లు చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం.
ఇప్పటిదాకా ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సెలబ్రిటీలు. సుడిగాలి సుధీర్ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు.ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటిటి లో అడుగుపెడుతునందుకు ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను.”
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…