సీమంతం చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల !!!

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్‌గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతొంది.

ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. రచయిత మరియు దర్శకుడిగా సుధాకర్ పాణి వ్యవహరిస్తున్నారు. సంగీతం ఎస్. సుహాస్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్‌ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 14న న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో వజ్రయోగి మాట్లాడుతూ…
సినిమా మీద బలమైన కోరికతో సీమంతం సినిమా చేశాను. కొత్తవారికి ఎప్పుడూ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ మమ్మల్ని తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న మా సినిమా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి, ఎస్ సుహాస్ మా సినిమా కోసం మంచి సంగీతాన్ని ఇచ్చారు అలాగే అమర్ గారు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది అలాగే సన్నివేశానికి సన్నివేశానికి ఇంటెన్సిటి తగ్గకుండా స్క్రీన్ ప్లే ను మైండ్ లో పెట్టుకొని కట్ చేశారు. మా డైరెక్టర్ సుధాకర్ గారు ఈ సినిమాను చాలా కొత్తగా తీశారు తనకు నాకు మా యూనిట్ అందరికి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ…
సీమంతం చిత్ర నిర్మాత హీరో వజ్రయోగి నా ఫ్రెండ్… నా కాలేజ్ ఫ్రెండ్ ను నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. సుహాస్ సంగీతం మనకు ట్రైలర్ లో చూస్తే మనకు అర్థం అవుతుంది, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరామెన్ శ్రీనివాస్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నవంబర్ 14న మా సీమంతం సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ…
ఈ సినిమా నాకు చాలా స్పెషల్. బాక్గ్రౌంగ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కాబోతున్న మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

సినిమాటోగ్రఫర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
సీమంతం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు. వర్క్ చెయ్యడానికి , నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా నాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుధాకర్ ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటారు అలాగే మా హీరో వజ్రయోగి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు. సుహాస్ సంగీతం, అమర్ ఎడిటింగ్ ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుందని అన్నారు.

కో ప్రొడ్యూసర్ గాయత్రి సౌమ్య మాట్లాడుతూ…
నవంబర్ 14న విడుదల కాబోతున్న మా సీమంతం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో ఒడిదుడుకుల తరువాత మా సినిమా ఆడియస్ దగ్గరకు వస్తోంది. థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న మా సినిమా కొత్తగా ఉంటుంది. మా లాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు అన్నారు.

హీరోయిన్ శ్రేయ భర్తీ మాట్లాడుతూ…
ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుధాకర్ గారికి, హీరో వజ్రయోగి గారికి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాతో లాంచ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. సీమంతం మీ అందరికి నచ్చుతుంది అన్నారు.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago