మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా సిఐ భార‌తి షూటింగ్ ప్రారంభం

కింగ్ డ‌మ్ మూవీస్ ప‌తాకంపై  ఘ‌ర్ష‌ణ  శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం ద‌ర్శ‌క‌త్వంలో  విశాల ప‌సునూరి నిర్మిస్తోన్న చిత్రం `సిఐ భార‌తి`.  న‌రేంద్ర,  గ‌రిమా  హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఈ రోజు హైద‌రాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్స‌వం గ్రాండ్‌గా   జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మ‌ల్లారెడ్డి స్క్పిప్ట్ అంద‌జేశారు. న‌టుడు అలీ తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం మాట్లాడుతూ…“రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం.  సిఐ భార‌తి ఒక ప‌వ‌ర్ ఫుల్ స్టోరి. మంత్రి మ‌ల్లా రెడ్డి గారు, న‌టుడు అలీ గారు మా చిత్రం ప్రారంభోత్స‌వానికి రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఆవులు ప‌శుగ్రాసం లేక చెత్త కుప్ప‌ల ద‌గ్గ‌ర పేప‌ర్లు తినే ప‌రిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్ట‌డం జ‌రిగింది. మా సినిమా ద్వారా వ‌చ్చే రిట‌ర్స్న్ లో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గ‌తంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీద‌ట కూడా కంటిన్యూగా సినిమాలు చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్   పూర్తి చేయ‌నున్నాం“ అన్నారు.


 స‌మ‌ర్ప‌కులు ఘ‌ర్ష‌ణ శ్రీనివాస్ మాట్లాడుతూ...“ ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డి గారు బౌండెడ్ స్క్పిప్ట్ తో వ‌చ్చారు. క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాను. ర‌మ‌ణా రెడ్డి గారు అన్నీ తానై సినిమా చేస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.


హీరో న‌రేంద్ర మాట్లాడుతూ…“ ర‌మ‌ణా రెడ్డి గారు అద్భుత‌మైన క‌థ‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఐదు అద్భుత‌మైన పాట‌లున్నాయి. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా న‌టించ‌డం చాలా సంతోషం. ద‌ర్శ‌కుడు ర‌మ‌ణా రెడ్డి గారు నా క్యార‌క్ట‌ర్ చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాం“ అన్నారు.
హీరోయిన్ గ‌రిమా మాట్లాడుతూ…“సిఐ భార‌తి చిత్రంలో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 నటీ-నటులు
హీరో నరేంద్ర, హీరోయిన్ గరిమా..
సమర్పణ : ఘ‌ర్ష‌ణ శ్రీనివాస్
బ్యానర్ : కింగ్ డమ్ మూవీస్
నిర్మాత :  విశాల ప‌సునూరి
కో-ప్రొడ్యూస‌ర్ః రేణుక కాసుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వెంక‌టేశ్వ‌ర‌రావు
డైరెక్టర్ : రమణారెడ్డి గడ్డం
మ్యూజిక్ : ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రాఫర్ :  శ్రీనివాస రెడ్డి
ఎడిటర్ :రామారావు
ఆర్ట్ః ఆనంద్‌
డాన్స్ః హ‌రి
పి. ఆర్. ఓ : చందు రమేష్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago