ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు. అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…