“చమన్” (ఎడారి లో పుష్పం) టైటిల్ లాంచ్

దివంగత “శ్రీ చమన్ సాబ్ గారు” ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. విధివశాత్తు “శ్రీ చమన్ గారు” కాలం చేయడంతో అయన మిత్రుడిగా ఆయన మీద అభిమానంతో సినిమాను రూపొందించాలనుకున్నాను. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. అన్ని కుదుట పడడటంతో ముఖ్యంగా ఈ రోజు “శ్రీ చమన్” గారి కుమారుడైన “ఉమర్ ముక్తర్” కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహనీయుడి జీవితం ఆదర్శప్రాయమైన ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆ మహనీయుడికి ఘనమైన నివాళిని తెలియ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.శ్రీ చమన్ గారు దర్శకత్వ బాధ్యతల్ని “వెంకట్ సన్నిధి” చేత చేయించాలని భావించారు. ఆయనకు మాట ఇవ్వటంతో “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ “జి.వి. 9 ఎంటర్టైన్మెంట్” సంస్థ ద్వారా జివి చౌదరి గారు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం పేరు “చమన్” గా ఖరారు చేసారు. “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేస్తున్నారు. త్వరలోనే సినిమా సాకేంతిక నిపుణులు, పూర్తి తారాగణం వెల్లడిస్తాం.జి.వి. చౌదరి ప్రొడ్యూజర్ మాట్లాడుతూ: నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ “దూదేకుల చమన్‌ సాబ్”. అయ్యన కుమారుడు “ఉమర్‌ ముక్తర్‌” బర్త్ డే కానుకగా, జి.వి. 9 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో పాటు మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న “శ్రీ చమన్” గారి బయోపిక్ సినిమా కి, “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేయడం మాకు చాలా హ్యాపీ గా ఉంది. అదే విధంగా “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మా సినిమా టైటిల్ పేరు “చమన్” (ఎడారి లో పుష్పం) ఈ సినిమా అందరిని అలరించబోతుంది. త్వరలోనే అక్టోబర్ లో కాస్టింగ్ వివరాలు వెల్లడిస్తాము. నేను ఎన్నో సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీ లో పని చేస్తూ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బాలయ్య బాబు ఒకరు.

వెంకట్ సన్నిధి డైరెక్టర్ మాట్లాడుతూ: ఒక మహనీయుడి జీవిత చరిత్ర మీద నేను డైరెక్ట్ చెయ్యబోతున్నందుకు నా అదృష్టం గా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీ లో ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తూ వచ్చాను కానీ, గత 14 సంవత్సరాలు గా నేను సినిమాలకి దూరంగా ఉన్నాను, కేవలం సినిమాలకి డైరెక్ట్ చేద్దామనే ఇష్టంతో, ఇప్పుడు నాకు ఈ సినిమాతో అవకాశం దక్కింది.శ్రీ చమన్‌ సాబ్ గురించి చెప్పాలి అంటే తన కుటుంభ భవిషత్తు అన్నింటిని ఫలంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. ఆయన గురించి ఈ తరం యువత కి తేలియాలిసిన కధ ఇది. టెన్త్ క్ల్యాస్ కూడ పాస్ కానీ ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇండియా లోనే బెస్ట్ జెడ్పీ చైర్మన్‌గా అవార్డు రావడం గొప్ప విషయం. అంతే కాదు, కుల మత బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే ఏకైక వ్యక్తి శ్రీ చమన్ గారు. అనంతపురం ఒక ఎడారి లాంటి జిల్లా ని మెరుగైన స్థాయి కి తీసుకురావడంతో ఈ సినిమాకి “చమన్” (ఎడారి లో పుష్పం) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ఎవ్వరిని కించపరచని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రొడ్యూజర్ గారితో ఎంతో అనుబంధం ఉంది. అలాగే, సి రామ్ ప్రసాద్” మా సినిమా కి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేయడం మా అదృష్టం. ఇండియా లో డీఓపీ గా గొప్ప స్థాయి కి వెళ్తారని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కి అయ్యన అన్ని ముందుండి మామ్మలందరిని సక్సెస్ బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాను.

“సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మాట్లాడుతూ: డైరెక్టర్ వెంకట్ సన్నిధి నా చిరకాల మిత్రుడు, కథ చెప్పినప్పుడు నేను బాగా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా ఎవ్వరిని కించపరిచే విధంగా ఉండదని ప్రేక్షకుల అందరిని అలరించే విధంగా ఉంటుందని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూసర్ జి.వి. చౌదరి గారిని కలిసింది ఒక్కసారే అయ్యిన, ఆయన ఎంతో ప్యాషినేటెడ్ గా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి తో నేను కోలాబ్రేట్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది.మోహిత్ రెహమాన్య మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ: నేను ఏ.ఆర్. రెహమాన్ శిష్యుణ్ణి అయ్యనంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం ప్రొడ్యూజర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి వర్క్ చెయ్యబోతున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

11 minutes ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago