రాయచోటిలో ఘనంగా జరిగిన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Must Read

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా, శశికా టిక్కూ, అషురెడ్డి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో ప్రముఖులు, ముఖ్య అతిథిలు మధ్య చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మూవీ కాస్ట్ అండ్ క్రూతో పాటు జబర్దస్త్ నటీనటులు వినోదిని, పంచు ప్రసాద్, నాగిరెడ్డి, ఫణి, ఉప్పల్ బాలు, శాన్వి, సత్తి, రేలారే రేలా గోపాల్ పాలుపంచుకున్నారు. వీరితో పాటు రాయచోటిలో ఉన్న ప్రముఖ డాక్టర్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. పాటలు, ఫన్నీ స్కిట్స్‌తో వేడుకకు వచ్చిన విశేష ప్రేక్షకులు కేరింతలతో వేడుక ఆద్యంతం ఉరూతలూగింది.

ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వస్తున్న పద్మహ్యూహంలో చక్రధారి సినిమా పెద్ద హిట్ అవుతుందని పేర్కొన్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో రాయచోటి నుంచి ఇద్దరు హీరోలు ఉన్నారని, యూత్ ఫుల్ సినిమాలతో అలరించే కిరణ్ అబ్బవరం ఈ ప్రాంతం వాడే అని, అలాగే ఈ సినిమా హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ కూడా ఇదే ప్రాంతం వాడు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రవీణ్ రాజ్‌కుమార్ సైతం కిరణ్ అబ్బవరం అంత గొప్ప పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. జూన్ 21 అందరూ పద్మహ్యూహంలో చక్రధారి చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా ట్రైలర్ చాలా బాగుండడంతో ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మంచి నిర్మాణ విలువలతో, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ పద్మవ్యూహంలో చక్రధారి జూన్ 21న ఘనంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

చిత్రం: పద్మవ్యూహంలో చక్రధారి
నటీనటులు: ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా వాసు వన్స్ మోర్ తదితరులు.
సంగీత దర్శకుడు: వినోద్ యజమన్య
సినిమాటోగ్రఫీ: జీ. అమర్
ఎడిటర్: ఎస్.బి.ఉద్దవ్
పీఆర్ఓ: హరీష్, దినేష్
బ్యానర్: వీసీ క్రియేషన్స్
నిర్మాత: కే.ఓ.రామరాజు
దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు

Latest News

Grand Teaser Launch Event of “Raju Gari Dongalu”

The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman,...

More News