‘చాయ్ వాలా’ నుంచి తొలి పాట ‘సఖిరే..’ విడుదల..

ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీ ‘చాయ్ వాలా’ నుంచి తొలి పాట ‘సఖిరే..’ విడుదల

వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ గురువారం రోజున తొలి పాట‌ను విడుద‌ల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ ఆర్‌.విహారి ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశారు. సురేష్ బ‌నిశెట్టి రాసిన ఈ పాట‌ను క‌పిల్ క‌పిల‌న్ పాడారు. ప్రేయ‌సిపై గుండెల‌నిండా స్వ‌చ్చ‌మైన‌ ప్రేమ‌ను నింపుకున్న హీరో త‌న భావాల‌ను అందంగా ఈ పాట రూపంలో వ్య‌క్తం చేస్తున్నారు.

హీరో శివ కందుకూరి స్ట‌న్నింగ్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. హీరోయిన్ తేజు అశ్విని బ్యూటీతో చూపులు తిప్పుకోనీయ‌టం లేదు. ఈ మెలోడీలో రొమాంటిక్ మూమెంట్స్ విజువ‌ల్ ట్రీట్‌లా ఉంది. పాట‌ అంద‌రూ పాడుకునేలా ఉంది. క‌పిల్ క‌పిల‌న్ గొంతు నుంచి వ‌చ్చిన ఈ పాట మ‌రింత మాధుర్యంగా అనిపిస్తోంది. ప్రేమించేవాళ్ల‌కు, మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు ఈ పాట బాగా క‌నెక్ట్ అవుతుంది.

ప్ర‌మోద్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. క్రాంతి వ‌ర్ల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప‌వ‌న్ న‌ర్వ ఎడిట‌ర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago