రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2

టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయి, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ : టి సి ఏ 2006లో స్థాపించారు. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆర్గనైజర్ సాయి ఒక చారిటీ కోసం ఈ క్రికెట్ కార్నివాల్ ని నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో తరుణ్ మాట్లాడుతూ : సాయి గారు ఈ క్రికెట్ కార్నివాల్ చారిటీ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా మంచి విషయం. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము అని కచ్చితంగా చెప్తున్నాను. ద రాయల్ చిల్డ్రన్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం ఆడుతున్నాం. ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. నవంబర్ లో జరిగే ఈవెంట్ కి సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుంది. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ : మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేము అందరం కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. సాయి గారు ఇంత గ్రాండ్ గా ఒక చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ : టి సి ఎ ఎప్పుడు క్రికెట్ మ్యాచెస్ పెట్టిన క్రికెట్ కాకుండా దానికి ఒక మంచి కారణం కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడినప్పుడు ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ చారిటీ కోసం ఆడం. ఈ సీజన్ టు కూడా అదే మంచి కారణం కోసం ఆడడం మంచి విషయం. సినిమా ప్రమోషన్స్ వల్ల కొంతమంది రాలేకపోయారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ కి అందరూ వస్తారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ : శ్రీకాంత్ గారు తరుణ్ చారిటీ కోసం టి సి ఏ తరఫున ఎప్పటినుంచో క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు దాంట్లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఆర్గనైజర్ సాయి గారు సీజన్ 1 టైం లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఒక చారిటీ కోసం ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం చాలా మంచి విషయం. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. సీజన్ 1 లా సీజన్ 2 కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. సాయి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇలా సీజన్ 2 సంబంధించిన పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నన్ను కూడా ఈ చారిటీ క్రికెట్ మ్యాచ్ లో భాగం చేసినందుకు తరుణ్ అన్నకు శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు. సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ : ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. మేమందరం సినిమా పరంగా ఎక్కువ కలవకపోయినా క్రికెట్ గ్రౌండ్లో కచ్చితంగా కలుస్తాం. ఇప్పుడు చారిటీ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడడం ఆనందంగా ఉంది. సీజన్ 2 సీజన్ 1 కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఓంకార్ గారు మాట్లాడుతూ : ఒక మంచి చారిటీ కోసం సాయి కృష్ణ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని లాంచ్ చేశారు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఆస్ట్రేలియాలో సీజన్ 1 కి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు అదే చారిటీ కోసం సీజన్ 2 నిర్వహిస్తున్నారు. సీజన్ 2 కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

10 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago