అక్టోబర్ 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ‘సి 202’

Must Read

డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో ‘సి 202’ అనే చిత్రం రాబోతోంది. ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ మీద మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రంలో మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన చిత్రాన్ని ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించారు. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నటీనటులు : మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు

సాంకేతిక బృందం
చిత్రం పేరు :  ‘సి 202’
బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్
నిర్మాత : మనోహరి కె ఎ
కో ప్రొడ్యూసర్ : చిన్నయ్య కొప్పుల, అలివేణి వొల్లేటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దత్తు ఎమ్
కెమెరా మెన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా
డీఐ : డెక్కన్ డ్రీమ్స్
అట్మాస్ మిక్స్ : దేవి కృష్ణ కడియాల
సౌండ్ ఎఫెక్ట్స్ : సాయి శ్యాం. కె
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశీ

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News