ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ “ఇడుపు కాయితం”

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, కేఎల్ దామోదరప్రసాద్, ఎస్ కేఎన్, బాపినీడు, ధీరజ్ మొగిలినేని, దర్శకులు మెహర్ రమేష్, చందూ మొండేటి, సాయి రాజేశ్, వేణు ఊడుగుల, సాయి మార్తాండ్ అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా

నటుడు బిత్తిరి సత్తి మాట్లాడుతూ – “ఇడుపు కాయితం” సినిమా ప్రారంభోత్సవం చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. సావిత్రి, సుజాత,స అభయ్, మైమ్ గోపి..ఇలా మా అందరినీ ఈ సినిమాలోకి తీసుకొచ్చారు డైరెక్టర్ వంశీరెడ్డి. ఈ సినిమా టైటిల్ లోనే కాగితాలు చిరిగిపోతున్నాయి. రేపు థియేటర్స్ లో టికెట్స్ చిరగాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి సావిత్రి మాట్లాడుతూ – నటిగా నా మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వంశీ అన్నకు థ్యాంక్స్. ఈ సినిమాలో 80శాతం లేడీస్ ఉన్నాం. ఇలాంటి మంచి కథ ద్వారా మా అందరికీ అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నటి చంద్రవ్వ మాట్లాడుతూ – బ్యూటిఫుల్ స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ లభించింది. త్వరలో మీరు ఈ సినిమా చూశాక ఈ పోస్టర్ గుర్తొస్తే ఎమోషనల్ అవుతారు. నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాలకు భిన్నమైన పాత్ర ఇది. స్మాల్ స్క్రీన్ మీద పేరు తెచ్చుకున్న మేము ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ మీద యాక్టర్స్ గా గుర్తింపు సంపాదించుకుంటామని నమ్మకం ఉంది. మా సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది. అన్నారు.

నటి జోర్దార్ సుజాత మాట్లాడుతూ – ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పను. నా క్యారెక్టర్ ఒక వర్గానికి ఇన్సిపిరేషన్ గా నిలిచేలా ఉంటుంది. అంతా మన వాళ్లే చేస్తున్నారు అనే ధీమా మా అందరిలో కనిపిస్తోంది. ఈ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

నటుడు రచ్చరవి మాట్లాడుతూ – ఇది ఇడుపు కాయితం కాదు ఇది అందరినీ కలిపే కాయితం. ప్రతి కుటుంబాన్ని కలిపే కాయితం ఈ సినిమా. ఈ కథ ప్రతి ఇంటిది, ప్రతి మనసుది, ప్రతి ఆడబిడ్డది. ప్రియదర్శి, బన్నీవాస్, సుకుమార్ గారు..ఈ ముగ్గురినీ కలిపింది మా డైరెక్టర్ వంశీ అన్న. తెలుగు సినిమా కథకు ఒక పూలదండ లాంటి కథ ఇది. నేను దర్శ కలిసి బలగం లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ చేశాం. ఈ సినిమా కూడా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. అన్నారు.

నటుడు మైమ్ మధు మాట్లాడుతూ – ఈ కథ విని మేమంతా చలించిపోయాం. మేము నటించనక్కర్లేదు, ఈ కథే మమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకం కలిగింది. ఒక ఆణిముత్యం లాంటి కథతో దర్శకుడు వంశీ ఈ సినిమా రూపొందిస్తున్నారు. బలగం తర్వాత మరో గొప్ప నేటివిటీ సినిమా అవుతుంది. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.

నటుడు అభయ్ బేతిగంటి మాట్లాడుతూ – దర్శితో నేను మెమొరబుల్ మూవీస్ చేశాను. నా కెరీర్ లో మంచి మూవీస్ దక్కడం అదృష్టంగా భావిస్తా. అలాంటి మంచి చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమా గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే మాట్లాడుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఏడాదిగా వింటున్నా. ఒక రోజు వంశీ అన్నీ ఆఫీస్ కు పిలిచాడు. ఈ సినిమా ఎలాగైనా చేయాలి అనుకుంటూ వెళ్లా. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – ఈ కథ విన్న తర్వాత, ఇంతమంది టీమ్ మెంబర్స్ ప్రాజెక్ట్ లోకి వచ్చాక, నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఈ “ఇడుపు కాయితం” పంచాయితీకి మూవీ రిలీజైన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూస్తారు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. యూనివర్సల్ ఫిలిం. ఈ కథకు ప్రాంతంతో సంబంధం లేదు. ఇలాంటి మంచి మూవీకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ వంశీకృష్ణ దొండపాటి మాట్లాడుతూ – మా “ఇడుపు కాయితం” సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ కథ చెప్పగానే నమ్మి సినిమా చేస్తున్నామని గట్టిగా చెప్పిన మా ఆడబిడ్డ తబిత గారికి థ్యాంక్స్. నమ్మితేనే ఎవరైనా పైకి వస్తారు. తబిత గారికి, సుకుమార్ గారికి, బన్నీ వాస్, దర్శి గారికి, వేణు ఊడుగుల, పూజారి నాగేశ్వరరావు, బూసం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు

ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ మాట్లాడుతూ – నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. పక్కా తెలంగాణ అమ్మాయిని. డైరెక్టర్ వంశీ గారు ఈ కథ చెబుతున్నప్పుడు మేము చిన్నప్పుడు విన్న విషయాలు, పెద్ద వాళ్లు ఎలా హ్యాండిల్ చేసేవాళ్లు.. అవన్నీ గుర్తొచ్చాయి. నేను ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను. ఈ కథ విన్నప్పుడు సుకుమార్ తో చెప్పాను. మీరు ఈ కథకు కనెక్ట్ అవుతున్నారో లేదో గానీ నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి చాలా కనెక్ట్ అయ్యాను. మనం ఎలాగైనా సుకుమార్ రైటింగ్స్ లో ఈ సినిమా చేయాలని, మనం చేస్తున్నాం అంతే అని సుక్కుకు చెప్పాను. వంశీ ఈ క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా బాగా రాసుకున్నారు. వంశీ గారు కథ చెబుతున్నప్పుడే విజువల్ గా చూడగలిగాను. ఈరోజు పోస్టర్ చూశాక కూడా హ్యాపీ ఫీలింగ్ కలిగింది. సినిమా బయటకొచ్చాక ఇలా ఉంటుందేమో, ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. మీరందరూ తప్పకుండా ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సుకుమార్ రైటింగ్స్ లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్ టైటిల్స్ తో బిహార్ లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్ కు వెళ్లండి, అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్ కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. వీళ్లందరూ బిజీగా ఉంటారు. వీళ్లు కథ వినగానే మేము మిగతా వర్క్స్ వదులుకుని అయినా ఈ మూవీ చేస్తామని ముందుకువచ్చారు. కథే వీళ్లందరినీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది. జమ్మికుంట నుంచి వచ్చాడు వంశీ. నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఊరు కళ్లముందు కనిపించింది. అంత బాగా కథ చెప్పాడు. “ఇడుపు కాయితం”తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం. నేను సుకుమార్ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా. కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి. ఈ సినిమా కథను మా దగ్గరకు తీసుకొచ్చి మేమంతా కలిసి ఈ మూవీ చేసేలా చేసింది ప్రియదర్శి. నేను ఈ మూవీ చేయకపోయి ఉంటే ఒక మంచి కథను మిస్ అయ్యేవాడిని. రైట్ టైమ్ లో నా దగ్గరకు వచ్చిన రైట్ ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీ ఇక్కడిదాకా వచ్చేందుకు వేణు ఊడుగుల, జగన్, పూజారి నాగేశ్వరరావు హెల్ప్ చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. మా టీమ్ అంతా కలిసి ఒక మంచి మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.

హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ – యూట్యూబ్ లో నా పాటలు చూసి విని ఉంటారు. ఇప్పుడు “ఇడుపు కాయితం” అనే అద్భుతమైన మూవీతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తున్నాను. ఇండస్ట్రీకి హీరోయిన్ గా రావాలని ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటారు. మీ అందరి సపోర్ట్ తో నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. నేను ఈ స్టోరీని నమ్మాను. నన్ను ఈ స్టోరీ నమ్మింది. వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఈ అవకాశం కల్పించిన బన్నీ వాస్ గారికి, సుకుమార్ గారికి థ్యాంక్స్. వాళ్లను కలిసినప్పుడు నా పాటలు చూస్తాం, అభిమానిస్తాం అని చెప్పారు. టాలెంట్ ఎక్కడున్నా అది చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటుంది, దక్కాల్సిన గుర్తింపు తీసుకొస్తుంది అని అన్నారు. వారి మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కథలో నేను చేస్తున్న శ్రీలత అనే పాత్ర చాలా బరువైంది. ఈ పాత్ర నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ వంశీ గారు మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నా 25వ బర్త్ డే సుకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం మర్చిపోలేను. ఈ సినిమా కంటే బెస్ట్ ఎంట్రీ ఏం ఉంటుంది అనిపిస్తోంది. ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారో తెలిశాక మనోళ్లేరా, అనే ధైర్యం వచ్చింది. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ రచ్చ రచ్చ చేసేస్తారు అని చెప్పగలను. అన్నారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – ఈ రోజు “ఇడుపు కాయితం” లాంఛింగ్ ఈవెంట్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను గర్వంగా ఫీలయ్యే రోజు ఇది. మీరు నాపై చూపించిన ప్రేమను ఈ సినిమా ద్వారా తిరిగి మీకు అందించబోతున్నా. ఈ సందర్భంగా సుకుమార్ గారికి, బన్నీ వాస్ గారికి, తబిత గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వీళ్లు మా మీద 200 పర్సెంట్ లవ్ చూపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపించబోతున్నా. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలో అదంతా చేస్తాను. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు కానీ గర్వంగా చెప్పగలను ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. ఈ సినిమాను మేము జమ్మికుంట, ఇల్లంతకుంట, హైదరాబాద్, సనత్ నగర్ ఎక్కడ చిత్రీకరించినా, ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. వంశీ ఈ కథ చెప్పినప్పుడు ఇది నా కథ అని నమ్మాను. అలాగే మా టీమ్ అంతా నమ్మారు. ఇక మాటల్లేవు, ఏం మాట్లాడినా చూపించి మాట్లాడుతాం. సినిమా ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా వాళ్ల అందరి గురించి మాట్లాడుతాను. అన్నారు.

నటీనటులు – ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వత్ భైరి
ఆర్ట్ డైరెక్టర్ – ఆశిష్ తేజ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
డీవోపీ – ఎంఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ – సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్
ప్రొడ్యూసర్ – బన్నీవాస్
స్క్రిప్ట్, డైరెక్షన్ – వంశీరెడ్డి దొండపాటి
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), మడూరి మధు.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

1 day ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago