అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “బడ్డీ” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు గోకుల్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ గారికి థ్యాంక్స్. టెడ్డీ బేర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. “బడ్డీ” సినిమాను థియేటర్స్ లో ఫ్యామిలీతో కలిసి చూడండి. అన్నారు.
దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మేము చేసే మూవీస్ కు మీడియా సపోర్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు. మీ సపోర్ట్ మాకు కావాలి. నేను చేసిన ప్రతి మూవీ నిర్మాతను సంతృప్తి పరిచింది. “బడ్డీ” విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారు. మా టీమ్ కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమా సాధించబోయే సక్సెస్ తో పాటు నాకు ఇలా మా టీమ్ సంతోషంగా ఉండటమే కావాలి. “బడ్డీ”ని థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా తక్కువ టికెట్ రేట్లతో మీ ముందుకు ఆగస్టు 2న వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎంతో లవ్, హార్డ్ వర్క్ తో “బడ్డీ” సినిమా చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను. అన్నారు.
హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ – “బడ్డీ” రిలీజ్ కోసం మేమంతా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ ఎప్పుడు అని నేను మా డైరెక్టర్ ను రెగ్యులర్ అడిగేదాన్ని. ఆయన త్వరలోనే అంటూ రిప్లై ఇచ్చేవారు. “బడ్డీ” మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. నాకు ఇది ఫస్ట్ మూవీ. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ – లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న సినిమా “బడ్డీ”. ఈ చిత్రానికి తక్కువ టికెట్ రేట్స్ పెట్టారు. రిలీజ్ ముందు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో వేసిన మూడూ షోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. అల్లు శిరీష్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించాను. శిరీష్ తాను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని ఎప్పుడూ బిహేవ్ చేయడు. హీరోయిన్ గాయత్రికి తెలుగులో రెండో సినిమా. దర్శకుడు శామ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి మూవీ తీసుకొస్తున్నారు. బాగున్న సినిమాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. “బడ్డీ”కి కూడా మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ – “బడ్డీ” సినిమా రిలీజ్ ముందు వేసిన షోస్ కు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, పిల్లలు, పెద్దలు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. నేను కూడా వారితో కలిసే సినిమా చూశాను. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది సెకండ్ వీక్ థియేటర్స్ కు వెళ్తున్నారు. అందుకే “బడ్డీ” సినిమాకు సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడి మా ప్రొడ్యూసర్ టికెట్ రేట్లు తగ్గించారు. అందుకు జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను సెకండ్ హీరో అనుకోవచ్చు. టెడ్డీ బేర్ ఫస్ట్ హీరో. తను చేసే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా చేశా. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు సరైన లాజిక్ కూడా ఉంటుంది. “బడ్డీ”లో టెడ్డీ బేర్ సినిమాలు బాగా చూస్తుంటంది. తను అందరు హీరోల ఫ్యాన్. అందుకే కొన్ని ఫేమస్ డైలాగ్స్ పెట్టాం. ఆగస్టు 2న థియేటర్స్ కు వెళ్లండి. “బడ్డీ” మీ అందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
నటీనటులు – అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – రూబెన్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
ఆర్ట్ డైరెక్టర్ – ఆర్ సెంథిల్
మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ
బ్యానర్ – స్టూడియో గ్రీన్ ఫిలింస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్ – కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – శామ్ ఆంటోన్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…