బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ మ‌రియు గంజాయి మాఫీయాపై బ్ర‌హ్మ‌స్త్రం అభినవ్

శ్రీ‌ల‌క్ష్మి ఎడ్యుకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాల‌ల చిత్రం “అభినవ్” (chased padmavyuha). 

భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ నిర్మాత మ‌రియు ద‌ర్శ‌కునిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేశారు.

గ్రామీణ ప్రాంతాల‌లోని హ‌రిజ‌న‌, గిరిజ‌న విద్యార్థుల‌ను స‌త్య అనే గంజాయి మాఫియాడాన్ విద్యార్థుల‌తో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజ‌న బాలుడు స్మ‌గ్ల‌ర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. భార‌తి అనే అభ్యుద‌య ఉపాధ్యాయురాలి ద్వారా ప్రేరణ పొందిన అభినవ్, రోహ‌న్‌, అక్ష‌ర మ‌రియు ఇత‌ర బాల బాలిక‌లు ఎన్‌సీసీ మ‌రియు ఆర్మీ శిక్ష‌ణ పొందుతుంటారు. ఎన్ఎస్ ఎస్ ప్రొగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్ళిన గిరిజ‌న విద్యార్థుల స్థితిగ‌తుల‌ను గ‌మ‌నించి డ్ర‌గ్ మాఫియాను అంతం చేయ‌డానికి ఆర్మీ త‌ర‌హా శిక్ష‌ణ తీసుకుని గంజాయి మాఫియా డాన్ స‌త్య ద్వారా బందింప‌బ‌డ్డ బాల కార్మికులను విముక్తి చేసి స్మ‌గ్ల‌ర్ గా మారిన బంటిని స‌త్య త‌మ్ముడైన విష్ణు మ‌రియు సామాజిక సంఘ సంస్క‌ర్త విజ‌య‌ల‌క్ష్మి బంటిని మారుస్తారు.

నిజం తెలుసుకున్న బంటి తన జీవితాన్ని నాశ‌నం చేసిన స‌త్య‌ను కాల్చి చంపుతాడు.

ఈ చిత్రం యొక్క ప్ర‌ధాన ఉద్దేశం బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డం మ‌రియు గంజాయి మాఫియ‌కు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బ‌లి కాకుండా మ‌రియు విద్యార్థి ద‌శ నుండే ఎన్ ఎస్ ఎస్ మ‌రియు ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ల‌లో శిక్ష‌ణ పొంది దేశ ర‌క్ష‌ణ‌లో విద్యార్ధులు కూడా భాగ‌స్వాములు కావాల‌నేది ఈ చిత్ర క‌థ‌, ప్ర‌ధాన ఉద్దేశ్యం.

ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో స‌మ్మెట గాంధీ మ‌రియు మాఫియా డాన్ గా స‌త్య ఎర్ర‌,  ప్ర‌ధాన బాల న‌టులు మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్‌, అభిన‌వ్‌, చ‌ర‌ణ్, బేబీ అక్ష‌ర – కెమెరా – సామ‌ల భాస్క‌ర్‌, సంగీతం – వందే మాత‌రం శ్రీ‌నివాస్‌, ఎడిట‌ర్ – నంద‌మూరి హ‌రి, ఈ చిత్రాన్ని సార‌థి స్టూడియో యొక్క స‌హ‌కారంతో పూర్తి చేయ‌డం జ‌రిగింది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago