బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ #BoyapatiRAPO టైటిల్ స్కంద- ది ఎటాకర్, టైటిల్ గ్లింప్స్ విడుదల
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ##BoyapatiRAPO పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరొక పేరు అయిన ‘స్కంద’ని టైటిల్ గా లాక్ చేశారు మేకర్స్. ఎటాకర్ అనే ట్యాగ్ లైన్ హీరో ఫెరోషియస్ స్వభావాన్ని సూచిస్తోంది. కార్తికేయస్వామి ఆయుధం శూలం టైటిల్ లోగోలో వుంది.
టైటిల్ గ్లింప్ల్స్ లో రామ్ మాస్, రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. గుడిలోని చెరువులో గూండాల ముఠాపై ఫైట్ చేస్తూ ఎటాకింగ్ మోడ్ లో కనిపించారు.”మీరు దిగితే ఊడేదుండదు… నేను దిగితే మిగిలేదుండదు” అనే పవర్-ప్యాక్డ్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు రామ్.
స్టన్ శివ కొరియోగ్రఫీ చేసిన ఈ హై-ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌లో అద్భుతమైన బ్లాక్స్ ఉన్నాయి. SS థమన్ అద్భుతమైన నేపధ్య సంగీతం విజువల్స్ మాస్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. టైటిల్ గ్లింప్స్ తుఫాను సృష్టిస్తుంది.
మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు.
‘స్కంద’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డివోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…