అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్
శివ కంఠంనేని
చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… దర్శకసంచలనం, “రాజమౌళి ఆఫ్ భోజపురి” గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. రేపు (మే 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి – అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది!!

ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ… “గోసంగి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. ఈ చిత్రం నటుడిగా నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. నటుడిగా నాకు మళ్ళీ అవార్డులు తెచ్చే ఈ చిత్రం మా నిర్మాతలకు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు దోహదపడుతుంది” అన్నారు!!



శ్రీసూర్య, ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు, రచన – దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!