”భోళా శంకర్” ట్రైలర్ జూలై 27న విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ ట్రైలర్ జూలై 27న విడుదల

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు.  

భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నారు. మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు బిగ్ ఎంటర్ టైమెంట్ రాబోతోంది. పోస్టర్‌లో చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు.

తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Tfja Team

Recent Posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

22 hours ago

‘ఎర్రచీర’ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…

22 hours ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…

22 hours ago

బరాబర్ బాధపడుతున్నాను!!

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…

22 hours ago

3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు,హోస్ట్‌గా శివ బాలాజీ

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…

22 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

22 hours ago