తిరువీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో “భగవంతుడు” మూవీ పోస్టర్ రిలీజ్

Must Read

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా నుంచి ఈ రోజు హీరో తిరువీర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

“భగవంతుడు” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకోనుంది.

నటీనటులు – తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – రాజ్ తోట
మ్యూజిక్ – కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
సమర్పణ – ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – రవి పనస
స్టోరీ, డైరెక్షన్ – గోపి.జి.

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News