బెనాక గోల్డ్ సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. మెగా బ్రదర్ నాగబాబు ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు జరిగిన బెనాక గోల్డ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న హిందూ లీడర్, సోషల్ వర్కర్, బెనాక గోల్డ్ వ్యవస్థాపకులు భరత్ కుమార్. ఎస్., ఆయన టీమ్ కు నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
బెనాక గోల్డ్ ఫౌండర్ భరత్ కుమార్. ఎస్. మాట్లాడుతూ – నాగబాబు గారు మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. ఆయన లాంటి వండర్ ఫుల్ పర్సన్ సపోర్ట్, గైడెన్స్ మాకు లభించడం సంతోషంగా ఉంది. మీ అందరి నమ్మకాన్ని పొంది ఈ రోజు మా సంస్థ యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మీ గోల్డ్ ను సేల్ చేసుకోకండి, సేవ్ చేసుకోండి అనేది మా సంస్థ ద్వారా ఇస్తున్న సూచన. అన్నారు.
యంగ్ డైరెక్టర్ దీపక్ ఆవుల మాట్లాడుతూ – బెనాక గోల్డ్ కోసం యాడ్ చేయాలని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాం. అప్పుడు మాకు అనిపించిన ఒకే ఒక సెలబ్రిటీ నాగబాబు గారు. ఆయన అయితేనే ఈ యాడ్ కు బాగుంటుందని నిర్ణయించాం. నాగబాబు గారితో బెనాక గోల్డ్ యాడ్ కు డైరెక్షన్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఆయన ద్వారా ఈ సంస్థకు మంచి ప్రచారం లభిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ – బంగారం అనేది మా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ఒక భాగం. మధ్య తరగతి కుటుంబ సభ్యులు, పేద వారు కూడా కొంతైనా బంగారం దాచుకోవాలని ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరంలో ఆ బంగారం మనల్ని ఆదుకుంటుందనే నమ్మకం కూడా వారిలో ఉంటుంది. బంగారానికి మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. శుభాకార్యం చేయాల్సిన వచ్చినా, మరేదైనా అవసరంలో బంగారం కుదవపెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ఆ బంగారం విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి బంగారాన్ని విడిపించి, అప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం విలువగట్టి, ఆ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించే సౌకర్యాన్ని బెనాక గోల్డ్ సంస్థ కల్పిస్తోంది. ఈ వివరాలన్నీ భరత్ కుమార్. ఎస్. చెప్పినప్పుడు పేద, మధ్య తరగతి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. అందుకే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ముందుకొచ్చాను. ఈ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…