తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ”నేను స్టూడెంట్ సార్!’తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. నేను స్టూడెంట్ సార్! మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. ప్రధాన తారాగణం సీరియస్ లుక్ లో ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ కెమరామెన్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…