హోంబలే ఫిలింస్ ‘బఘీర’ ఫస్ట్ సింగిల్ యాంథమ్ అఫ్ జస్టిస్ రిలీజ్ 

Must Read

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ఇది శ్రీమురళికి ఫస్ట్ తెలుగు రిలీజ్. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఫస్ట్ సింగిల్ రుధిర హరను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్ తో ఆకట్టుకుంది. రాంబాబు గోసాల ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ బ్యాక్ డ్రాఫ్ ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాయి. అనిరుద్ధ శాస్త్రి డైనమిక్‌ వోకల్స్ తో మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. సినిమాలో ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ డెప్త్ కూడా వుంటుందని ఈ సాంగ్ తెలియజేస్తుంది.  

బఘీరలో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఎజె శెట్టి డీవోపీ కాగా, ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్టర్.

పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర ​​చిత్రం విడుదల కానుంది.  

తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:

నిర్మాత: విజయ్ కిరగందూర్

బ్యానర్: హోంబలే ఫిల్మ్స్

కథ: ప్రశాంత్ నీల్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి

తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: AJ శెట్టి

సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్

ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్

యాక్షన్: చేతన్ డి సౌజా

ఆర్ట్ డైరెక్టర్: రవి సంతేహక్లు

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News