ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ వంటి బ్లాక్ బస్టర్‌తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి తన సత్తా చాటారు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. సెప్టెంబర్ 7న మరోసారి పాన్ ఇండియా లెవల్లో సందడి చేయటానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే షారూక్ ఈ ఏడాదితో సినీ జర్నీతో 31 వసంతాలను పూర్తి చేసుకోవటం విశేషం. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, ఫాలోవర్స్‌తో #AskSRK కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఓ మహిళా అభిమాని మాట్లాడుతూ ‘నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాను, డాక్టర్ కవల పిల్లలని చెప్పారు. వారికి పఠాన్, జవాన్ అనే పేర్లు పెట్టాలనుకుంటున్నా’నని అన్నారు. దానికి షారూక్ బదులిస్తూ ఇంకా మంచి పేర్లు పెట్టాలని సూచించారు.
ఓ అభిమాని తన స్నేహితుడు కోసం జవాన్‌లో పాత్రను ఇవ్వాలని కోరారు. దానికి షారూక్ ఖాన్ స్పందిస్తూ.. ‘అలా చేయటం కుదరని ప్రేమతో మీ స్నేహితుడుకి అర్థమయ్యేలా చెప్పండి’ అన్నారు.
జవాన్ సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్నకు షారూక్ ఖాన్ బదులిస్తూ ‘లేదు బిడ్డా.. స్నేహితులతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిందే’ అన్నారు.
జవాన్ టీజర్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘టీజర్ సిద్ధమవుతుంది. అందరూ ఎంజాయ్ చేసేలా సిద్ధం చేసి చూపిస్తా’నని అన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యిందని చెప్పిన కొందరి నెటిజన్స్‌కు షారూక్ సమాధానం ఇస్తూ..ఆల్ ది బెస్ట్.. జీవితంలో మీరు నేర్చుకుంది ఉపయోగపడుతుంది.. కొన్నిసార్లు అని సమాధానం ఇచ్చారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…