‘మనసు ఇచ్చిన పిల్లా’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన ‘బేబీ’ టీమ్

ప్రస్తుత ట్రెండ్‌లో  సినిమా పాటలతో పాటు మ్యూజికల్ ఆల్బమ్స్‌ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే అనేక ఫోక్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.   సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి.  తాజాగా మరో కొత్త ఫోక్ సాంగ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మనసు ఇచ్చిన పిల్లా.. మాట తప్పితే ఎల్లా’ అనే క్యాచీ టైటిల్‌తో ఈ పాటను రూపొందించారు. మంగళవారం  ఈ  సాంగ్ పోస్టర్‌‌తో పాటు పాట  ప్రోమోను రీసెంట్‌గా 5  ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న ‘బేబీ’ మూవీ టీమ్ విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  ఈ సాంగ్‌లో ప్రముఖ ఫొటో జర్నలిస్ట్  శ్యాం కుమార్ రావుట్ల లీడ్ రోల్‌ చేశారు. పులి పూజా ఫిమేల్ లీడ్‌గా నటించారు. రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి కలిసి దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు సర్ రమేష్ తుడిమిల్ల సాంగ్ కంపోజ్ చేశారు. నరేష్ పుట్టల నిర్మించారు.  ఇదొక లవ్ ఫెయిల్యూర్  సాంగ్, “బేబీ” చిత్రం తరహా లో ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లాడే కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందించారు. త్వరలోనే ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టు.. ఇది సంగీత ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని  మేకర్స్ చెప్పారు.  

నటీనటులు : రావుట్ల శ్యాం కుమార్, పులి పూజా
రచయిత : వి.వి.విశ్వేష్ వర్మ
మ్యూజిక్ : రమేష్ తుడిమిల్ల
సింగర్   : హనుమంత్ యాదవ్
కెమెరా మెన్ : కిషన్, లక్కీ
ఎడిటర్ : నిరంజన్, సతీష్
దర్శకత్వం : రాజేష్ మిట్టపల్లి, రవి వడపల్లి
నిర్మాత : నరేష్ పుట్టల
పీఆర్‌‌వో : జీకే మీడియా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago