అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వానర” సినిమా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్ చేశారు. పాటను మంచి బీట్ తో కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, భరద్వాజ్ గాలితో కలిసి లిరిక్స్ రాసి పాడారు. ‘అదరహో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘అదర బెదరహో బెదరహో అదరహో, బెదర అదరహో అదరహో బెదరహో..అల్లాటప్పా ఆటలే అల్లాడించే వేటులే కుర్రాడితో వేటలో అబ్బా భలే ఘాటులే..’ అంటూ ర్యాప్ స్టైల్ లో సాగుతూ ఆకట్టుకుంటుందీ పాట.
నటీనటులు – అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – వివేక్ సాగర్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
స్టోరీ, స్క్రీన్ ప్లే – విశ్వజిత్
సమర్పణ – శంతను పత్తి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు – అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
డైరెక్షన్ – అవినాష్ తిరువీధుల
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…