వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్‌లా, అద్బుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయిక అవికాగోర్ సర పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. లక్ష్య సాధనలో ఆది పాత్రకు సపోర్ట్ చేస్తూ ఆయనకు తోడుగా నిలిచే పాత్ర. తప్పకుండా ఆమె కెరీర్‌లో ఈ పాత్ర , సినిమా మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ తన నటనతో అందరి హృదయాలను హత్తకుంటుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివరి షెడ్యూల్‌ను పూర్తిచేసాం. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…