ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ సమర్పణలో గౌతమ్ కార్తిక్ హీరోగా ఎన్.ఎస్ పొన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ మూవీ ‘ఆగస్టు 16, 1947’ (16th August 1947). ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి భారీ బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహా నిర్మాత. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో మురుగదాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947..ఈ కథ చదువుతున్నపుడు చాలా అద్భుతంగా అనిపించింది. కథ చదివినప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా స్పెషల్ మూవీ. ఆగస్టు 16, 1947 పిరియాడిక్ ఫిల్మ్. ఆగస్టు 15 దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఆగస్టు 14, 15, 16 ఈ మూడు రోజుల్లో ఓ మారుమూల పల్లెలో జరిగే కథ ఇది. చుట్టూ అడవి కొండ మధ్య వున్న వూరు. అక్కడికి ఒక వార్త చేయడం కష్టం. ఫ్రీడమ్ అంటే భయాన్ని జయించడం. ఆగస్ట్ 15న ఫ్రీడమ్ వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ఆ ఊరు ఇంకా స్వతంత్రం కోసం పోరాడుతూనే వుంటుంది. ఓ బ్రిటిష్ అధికారి ఈ వార్తని ఓ కారణం చేత వారికి తెలియకుండా దాచిపెడతాడు. వ్యక్తిగతంగా వారికి ఆగస్ట్ 16న స్వతంత్రం పొందుతారు. ఆగస్ట్ 16న ఏం జరిగిందనేది చాలా ఉత్కంఠ భరితంగా వుంటుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్, హ్యుమర్ ఇవన్నీ కలసి ఒక అందమైన కథ వుంటుంది. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాని విడుదల చేస్తున్న మధు గారు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు
గౌతమ్ కార్తిక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947 నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇంత మంచి ప్రాజెక్ట్ లో భాగం చేసిన మురుగదాస్ గారికి కృతజ్ఞతలు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది. దర్శకుడు చాలా గొప్పగా తీశారు. తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది. చాలా మంచి సినిమా. మీ అందరి ఆదరణ కావాలి’’ అన్నారు.
దర్శకుడు ఎన్.ఎస్ పొన్‌కుమార్ .. గతవారం విడుదలైన ట్రైలర్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 14న సినిమాని థియేటర్ లో చూసి ఆదరించాలి.’ అని కోరారు.
మధు మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947 సినిమా చాలా యూనిక్ గా అనిపించింది. క్లైమాక్స్ అంతా గూస్ బంప్స్ వచ్చాయి. ఏప్రిల్ 14న సినిమాని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు
Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…
నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…
ZEE5 లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ట్రైలర్ విడుదల చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. నరేష్ అగస్త్య, మేఘా…
~ Telangana's first detective series, ‘Vikkatakavi’ premieres on November 28 on ZEE5 ~ ~ Produced…
The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…