తొలి చిత్రం రౌడీ బాయ్‌తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ కోసం నూతన దర్శకుడు కాశీ విశాల్‌తో జతకట్టారు.సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆశిష్ రెడ్డి నోట్లో బీడీతోతన నిర్లక్ష్య వైఖరినిచూపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ప్రజంట్ చేసింది. గిరజాల జుట్టు, గడ్డంతో, తెల్లటి చొక్కా, ఆరెంజ్ కలర్ జీన్స్‌లో మాసీగా కనిపిస్తున్నాడు ఆశిష్. ఈ సినిమా కోసం ఆశిష్ మంచి ఫిజిక్ బిల్ట్ చేసుకున్నారు.
ఫస్ట్ లుక్ లో రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోని మ్యాప్‌ను సూచిస్తున్నట్లుగా.. ఈ సినిమా కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.
హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: ఆశిష్ రెడ్డి
సాంకేతిక విభాగం:
రచన దర్శకత్వం : కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రాఫర్: మణికంధన్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
సాహిత్యం: చంద్రబోస్
సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి
పీఆర్వో: మదురి మధు, వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…