వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తాజాగా అపోలో హాస్పిటల్స్ చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఈ అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోను అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఆవిష్కరించారు. కార్యక్రమంలో అపోలో డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ ‘‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో అందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించటంతో పాటు ఆశీర్వాదాలను అందించారు. నా ప్రెగ్నెన్సీ జర్నీని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండదు. అలాంటి మధుర క్షణాలను తల్లిదండ్రులకు అందిస్తోన్న డాక్టర్స్‌కు ధన్యవాదాలు.
నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకదు. ఆ విషయం నాకు తెలిసి బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందిచటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…