సురేష్ కొండేటికి మరో బాధ్యత

Must Read

సినీ జర్నలిస్ట్, సంతోషం సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటినీ మరో పదవి వివరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో గతంలో ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్.ఎన్.సి.సి. కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ గా అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన సురేష్ కొండేటి ఈసారి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు.

దీనికి చైర్మన్ గా ఎ.గోపాలరావు, కన్వీనర్ గా ఏడిద రాజా నియమితులైయారు. ఈ మేరకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీ కె.ఎస్. రామారావు మరియు సెక్రటరీ శ్రీ తుమ్మల రంగారావు చేతుల మీదుగా నియామక పత్రం సురేష్ కొండేటి అందుకున్నారు. ఈ సందర్భంగా తాను దీన్ని ఒక పదవిలా కాకుండా బాధ్యతలా చూస్తానని, కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ గా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సురేష్ కొండేటి అన్నారు.

Latest News

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో...

More News