పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక.
చెందు ముద్దు దర్శకత్వంలో.. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు లావణ్య జంటగా నటించిన సినిమా. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ తోపాటు రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు సుహాస్ చేతుల మీదుగా మరో పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా
సుహాస్ మాట్లాడుతూ.. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి పాట లాంచ్ చేశాం. నా చేతుల మీదుగా ఒక పాట విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. పాట చాలా బావుంది. తక్కువ బడ్జెట్ అయినా.. హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. హీరో చైతన్య, చెందు ముద్దుతో పాటు మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను..” అలాగే నిర్మాత యష్ గారికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ” వాల్యూబుల్ టైమ్ ఇచ్చి మా పాట విడుదల చేసి సుహాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాలో మొదటగా వచ్చే పాట ఇది. సినిమాలో ఊరికీ ఓ పాత్ర ఉంటుంది. ఆ ఊరి పాత్రను ఎస్టాబ్లిష్ చేస్తూ సాగే పాట ఇది. ఆ ఊరు ఎలాంటిది.. అక్కడి మనుషులు ఎలాంటివాళ్లు అనేది ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు ప్రిన్స్ హెన్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ట్యూన్ కు తగ్గట్టుగా మంచి లిరిక్స్ ఇచ్చాడు శ్రీనివాస్ మౌళి. పంకజ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది మా నిర్మాత యష్ గారికి చాలా థాంక్స్ అన్నారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ… ” మా సినిమాలో మొదటగా వచ్చే ఈ పాట సుహాస్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. తను నటించిన అంబాజీ పేట పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సుహాస్ కు థ్యాంక్స్. ఈ పాటను మౌళిగారు అద్భుతంగా రాశారు. మంచి ట్యూన్ కుదిరింది.అందరికీ థ్యాంక్యూ సో మచ్ అలాగే మా యష్ గారు ప్రమోషన్స్ బాగా ప్లాన్ చేసారు అన్నారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ” అన్నపూర్ణ ఫోటో స్టూడియోనుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ చేసినందుకు సుహాస్ గారికి థ్యాంక్స్. ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలను బాగా ఆదరించారు. అలాగే ఈ పాట కూడా మీ అందరికీ అంతే బాగా నచ్చుతుంది. ఒక మంచి ట్యూన్ కు తగ్గట్టుగానే మంచి లిరిక్స్ కూడా కుదిరాయి. డివోపి పంకజ్ గారు, డైరెక్టర్ చందు మరియు నిర్మాత యష్ గారికి థ్యాంక్స్ యూ..” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ.. ” పాట విడుదల చేసిన సుహాస్ గారికి థ్యాంక్యూ. ఒక మంచి అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ గారికి థ్యాంక్యూ. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాట ఇది.అలాగని రెగ్యులర్ ఫోక్ సాంగ్ లా ఉండదు. అందుకు తగ్గట్టుగా మౌళిగారు మంచి సాహిత్యం రాశారు. సాయి చరణ్ అంతే బాగా పాడారు. అన్ని రకాలుగా ది బెస్ట్ ఇచ్చాం. మీరు విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను..” అన్నారు.
లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ఇందుకు చెందుగారికి థ్యాంక్స్. నిర్మాత యశ్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. దర్శకుడు చెప్పినదాన్ని బట్టి సినిమాలో ఊరు కూడా ఒక పాత్ర. అందుకు తగ్గట్టుగా ఊరు జాగ్రఫీ, విజువల్స్ ఉండాలి.. కథ గురించి చిన్న గ్లింప్స్ కూడా ఉండాలన్నారు. పాటలో మొదటి లైన్ కే ఆయన సంతోషించారు. తర్వాత మంచి మంచి పోలికలతో ఈ పాటను చేశాం..” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ పంకజ్ మాట్లాడుతూ.. “ఈ పాటలోని సాహిత్యాన్నిబట్టి చూస్తే దీన్ని సుహాసే విడుదల చేయాలి. పాట ఎంత అందంగా ఉందో.. సుహాస్ మనసూ అంతే అందంగా ఉంటుంది. ఇక ఈ సాంగ్ పిక్చరైజ్ చేయడానికి చాలా లొకేషన్స్ తిరిగాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో
నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.
సాంకేతిక నిపుణులు : సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…