యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే..
పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీయ ప్లాట్‌ఫాంలలో ప్రాంతీయ కంటెంట్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మా సిరీస్ దేశ వ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామ’ అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ.. ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతోన్నాను. కానీ ఈ పాత్రను చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ. ZEE5 ప్రేక్షకులు ఆమె చేసిన ప్రయాణం, ఆమెలో వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా ఉంటాయి. పుష్ప పాత్ర.. కోల్పోవడానికి ఏమీ లేని, జీవితమంటేనే ఇంత అన్యాయంగా ఉంటుందని భావింస్తుంటుంది. అయితే అలా సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో చూపించాం. పుష్ప పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. అంజలి తన అసాధారణమైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారు. ZEE5, Pixel Picturesతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నటీనటులంతా కూడా అంకితభావంతో పని చేశారు. ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను “బహిష్కరణ” ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామ’ అని అన్నారు.
నటీనటులు:
అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాణ సంస్థ: పిక్సెల్ పిక్చర్స్ ఇండియా, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి, రైటర్ – డైరెక్టర్ : ముఖేష్ ప్రజాపతి, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్, సంగీతం : సిద్ధార్ద్ సదాశివుని, ఎడిటర్ : రవితేజ గిరిజాల, కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల, ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి, కో – రైటర్ : వంశీ కృష్ణ పొడపటి, డైలాగ్ రైటర్ : శ్యామ్ చెన్ను, కో- డైరెక్టర్ : రమేష్ బోనం, అసోసియేట్ డైరెక్టర్: ఆదిత్య ఆకురాతి, పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…