తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో అమ్మిరాజు ప్యానెల్ ఘనవిజయం..

Must Read

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కే సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయ ఢంకా మోగించారు.

కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా కే శ్రీనివాసులు రాజు, రాందాస్ ధనరాజ్ విజయం సాధించారు. ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇకమీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News