‘అమీర్ లోగ్’ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్

Must Read

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చింది. సాయి స్మరణ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. హరి నాకు మంచి మిత్రుడు. రమణ రెడ్డి గారు పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఇది చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్‌లో విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఆగస్ట్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’లోని ఆర్టిస్టులందరూ సహజంగా అనిపిస్తున్నారు. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. హరి మంచి ఆర్టిస్ట్, సింగర్. ట్రైలర్ బాగుంది. మంచి బిర్యానీ వాసన వస్తోంది. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు రమణ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ చిత్రం హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందరినీ ఏడ్పిస్తాం, నవ్విస్తాం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే అందరం ఎంతో కాన్ఫిడెంట్‌గా, సంతోషంగా ఉన్నాం. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ‘డాలర్ డ్రీమ్స్’, ‘పెళ్లి చూపులు’, ‘బలగం’ రేంజ్‌లో మా ‘అమీర్ లోగ్’ ఉంటుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా విడుదల చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్. ఆగస్ట్ 21న మా సినిమాని చూసి ప్రేక్షకదేవుళ్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ శశి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’కి ఈవెంట్లు చేయొద్దని ఒకప్పుడు అనుకున్నాం. కానీ ప్రతీ ఈవెంట్‌కి మాకు ఓ పండుగలా అనిపిస్తోంది. రమణ ఈ మూవీ కోసం అద్భుతమైన స్టోరీ సెట్ చేసుకున్నారు. ‘అమీర్ లోగ్’ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆగస్ట్ 21న రాబోతోన్న మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు ఎంసి హరి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. హైదరాబాద్ ఎంతో స్పెషలో.. నాకు ఈ సినిమా అంత స్పెషల్. ఈ మూవీతో మా ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులు పరిచయం కాబోతోన్నారు. మా నాన్న కూడా ఈ సినిమాలో నటించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ అన్నకి థాంక్స్. నేను బస్తీలో పుట్టి పెరిగాను. ఇప్పుడు ఓ బస్తీ సినిమాతోనే వస్తున్నా. ఆగస్ట్ 21న మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ మూవీని బస్తీలో షూట్ చేశాం. అక్కడ అందరూ మాకెంతో సపోర్ట్ చేశారు. మాకోసం వచ్చిన సింజిత్, సాయి మార్తాండ్‌లకు థాంక్స్. మేం ఈ చిత్రంతో అందరినీ నవ్విస్తాం, ఏడిపిస్తాం. ఆగస్ట్ 21న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నటుడు శశిధర్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ టీజర్, ట్రైలర్, పాటలు ఎంత బాగున్నాయో.. సినిమా కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

వేధ జలంధర్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ చిత్రంలో నేను పోషించిన గీత పాత్ర అందరికీ ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. ఓ స్ట్రాంగ్ ఉమెన్ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అంచనాలతో కాకుండా.. ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి మా సినిమాకి రండి’ అని అన్నారు.

నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా హైదరాబాద్ సోల్‌ను చూపిస్తుంది. రమణ అన్న చూడటానికి ఎంతో సాఫ్ట్‌గా ఉంటాడు. కానీ లోలోపల అగ్ని పర్వతం ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి స్మరణ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ చిత్రంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన సింజిత్, సాయి మార్తాండ్‌కి థాంక్స్. ఆగస్ట్ 21న రాబోతోన్న మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ మూవీకి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

తారాగణం : MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
PRO: సాయి సతీష్

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News