75 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించిన ‘పులి మేక’

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘పులి మేక’కు అమేజింగ్ రెస్పాన్స్…ఆనందంలో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ సహా ఎంటైర్ టీమ్

హైదరాబాద్, మార్చి 3, 2023: వ‌న్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్స్‌లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజరాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఇలా ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుంది జీ 5. పిక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్న‌పూర్ణ స్టూడియోస్ వారి లాస‌ర్ 2 . బీబీసీ స్టూడియోస్‌, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన‌. ఇంకా రేసీ, హ‌లో వ‌రల్డ్‌, మా నీళ్ల ట్యాంక్‌, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా విడుద‌టైన ఏటీఎంతో పాటు పులి మేక కూడా ఆ వ‌రుస‌లో చేరి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.

జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ క‌లిసి రూపొందించిన పులి మేక ఒరిజిన‌ల్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఇప్ప‌టికే 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించ‌టం విశేషం.

పులి మేక సిరీస్‌లో ప్రారంభం నుంచి చివ‌ర‌కు ఉండే ట్విస్టులు, ట‌ర్నుల‌ను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి క్యారెక్ట‌రైజేష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కిర‌ణ్ ప్ర‌భ అనే సిన్సియ‌ర్ అండ్ పవ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, నిజాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌నుకునే వ్య‌క్తిగా ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి క‌థ‌ను ముందుకు తీసుకెళ్లింది.

స్టోరీ లైన్‌, ట్విస్టులు, క‌థ‌లోని టెన్ష‌న్‌, అంత‌ర్లీనంగా ఉండే మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేల్యూ, న‌టీన‌టుల పెర్ఫామెన్సులు, సాంకేతిక నిపుణుల ప‌ని తీరు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక చివ‌ర‌లో సెకండ్ సీజ‌న్‌కు ఉంటుంద‌ని లీడ్ కూడా ఇచ్చారు. దీంతో ఆడియెన్స్లో ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత‌గా పెరిగింది. ఆది సాయికుమార్‌, గోప‌రాజు ర‌మ‌ణ, సిరి హన్మంత్‌, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్ర‌తీ పాత్ర‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

షో ర‌న్న‌ర్‌గా, రైట‌ర్‌గా కోన వెంక‌ట్ ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం పులి మేక క‌థ‌ను రాశారు. ఉదాహ‌ర‌ణ‌కు క్లైమాక్స్‌లో ఉండే ముగింపు కోన వెంక‌ట్‌గారి ఆలోచ‌న విధానాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగే వైవిధ్య‌మైన వెబ్ సిరీస్‌గా పులి మేక సాగుతుంది.
న‌టీన‌టులు:

కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, క‌రుణాక‌ర్ శ‌ర్మగా రాజా, ప‌ల్ల‌విగా సిరి హన్మంత్, ఆది సాయికుమార్ అసిస్టెంట్ వెంకట్ పాత్రలో ముక్కు అవినాష్, పాండు రంగారావుగా శ్రీనివాస్, శ్వేతగా స్పందన పల్లి న‌టిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
క‌న్విన్సిడ్, క్రియేటెడ్‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌కుడు : చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి.కె
సినిమాటోగ్ర‌ఫీ: రామ్ కె.మ‌హేష్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టోరి రైట‌ర్స్‌: కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు
కాస్ట్యూమ్స్‌: నీర‌జ కోన‌
పాట‌లు: శ్రీజో
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

3 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago