ఆగస్ట్ 15న విడుదలైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలను అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంటగా నటించింది నయన్ సారిక. ఆయ్ సక్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి పల్లవి పాత్ర ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని సంతోషపడుతుంది నయన్ సారిక. ఈ సందర్భంగా తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్షకులకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసింది. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించినందుకు ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా సక్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ సక్సెస్ వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన గీతాఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు అంజి కె.మణిపుత్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నయన్ సారిక.
స్కూల్, కాలేజీల్లో డ్రామాల్లో నటించి నటనపై మక్కువ పెంచుకున్న నయన్‌కు ముందు నుంచి హీరోయిన్ కావాలనేది కోరిక. ‘ఆయ్’ సినిమాలో నటించాలని ఆమెను మేకర్స్ కలిసినప్పుడు నటిగా తన కల నేరవేరుతుందనే దానిపై చాలా సంతోషపడింది. ‘‘ఆయ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావటానికి ముందు నేను, నార్నే నితిన్ కలిసి రిహార్సల్స్, వర్క్ షాప్స్‌లో పాల్గొన్నాం. తెలుగు కోసం ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చాం. నా టీమ్ సభ్యులు కూడా నాకెంతో సపోర్ట్ చేశారు’’ అని తెలియజేసింది నయన్ సారిక.
డిగ్రీ చదువుతుండగానే నటిగా నయన్ సారికకు అవకాశం వచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించాలనుకున్న కల నేరవేరుతున్నప్పటికీ చదువుని ఆశ్రద్ధ చేయకూడదని ఆమె నిర్ణయించుకుంది. నటిస్తూనే డిగ్రీని పూర్తి చేయాలనుకుంది. ‘ఆయ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ఫైనలియర్ డిగ్రీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది నయన్ సారిక. ‘‘షూటింగ్‌కి నేను బుక్స్, స్టడీ మెటీరియల్ తీసుకెళ్లేదాన్ని. డిగ్రీ ఫైనలియర్ ఎగ్జామ్స్ పూర్తి చేయటానికి నేను క్యారీవ్యాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటుండేదాన్ని. ఓ వైపు షూటింగ్, మరో వైపు పరీక్షల కోసం ప్రిపేర్ కావటం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని షూటింగ్ రోజులను గుర్తుకు చేసుకుంది నయన్.
‘ఆయ్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లను కలుసుకున్నారు. సినిమా సక్సెస్‌పై ఇద్దరూ స్టార్స్ టీమ్ సభ్యులను అభినందించారు. అలాగే నయన్ సారిక నటనను ప్రశంసించారు. ‘‘సినిమాలో చాలా ఈజ్‌తో నా క్యారెక్టర్‌లో నటించానని ఎన్టీఆర్‌గారు అభినందించారు. అల్లు అర్జున్‌గారైతే నన్ను దక్షిణాది అమ్మాయి అనే అనుకున్నారు. కాదని తెలిసి అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయినందుకు ఆశ్చర్యపోయారు. కళ్లతో చక్కగా హావభావాలను పలికిస్తానని అల్లు అరవింద్‌గారు ప్రశంసించారు. అంత పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు రావటం నాకెంతో గొప్పగా అనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది నయన్ సారిక.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…