గ్లోబల్ లెవెల్ లోనూ దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ‘పుష్ప: ది’ రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అల్లు అర్జున్ తో ఇన్‌స్టాగ్రామ్‌ చేసిన ఓ స్పెషల్
వీడియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ గారితో గడపడం విశేషం .


ఈ వీడియోలు బన్నీ దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు.
సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో చూపించారు.


“పుష్ప 2″ సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు” అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. “ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం” అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది.
“హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది” అని ఫిల్మ్ సిటీ గురించి బన్నీ వివరించారు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago