యువ సామ్రాట్ నాగ చైతన్య ‘తండేల్’ ఫస్ట్ లుక్ విడుదల

యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటిల క్రేజీ ప్రాజెక్ట్ #NC23 గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. వెర్సటైల్ యాక్టర్ నాగ చైతన్య, కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు చందూ మొండేటి, అనేక హిట్స్ ని అందించిన ఇండియా లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కలసి చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్న నాగ చైతన్యకు #NC23 హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.

రేపు నాగ చైతన్య పుట్టినరోజు జరుపుకోనున్నారు. అతని పుట్టినరోజుకు ఒక రోజు ముందు మేకర్స్ పెద్ద ట్రీట్ అందించారు.  #NC23కు ‘తండేల్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని  లాంచ్ చేసారు మేకర్స్.’తండేల్’ అంటే  శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం. ఒక వ్యక్తికి నిజమైన ప్యాషన్ వుంటే దాని కోసం ఏదైనా చేయగల సంకల్పం వుండటం.

నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌కి మారారు. కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. ఫస్ట్ లుక్ లో పొడవాటి జుట్టు,  గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించారు. చేతిలో ఓర్‌తో పడవపై కూర్చున్న నాగ చైతన్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లానే ఆకట్టుకునేలా ఉంది. సినిమా ఇంకా సెట్‌పైకి వెళ్లనప్పటికీ,  ఫస్ట్ లుక్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సూపర్‌హిట్ ‘లవ్ స్టోరీ’ తర్వాత ఇది వారి రెండవ చిత్రం. ‘తండేల్’ కూడా పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ప్రీ-ప్రొడక్షన్ పనులకి నిర్మాతలు మంచి బడ్జెట్‌ను వెచ్చించి అద్భుతంగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేశారు. డిసెంబర్‌లో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

TFJA

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

2 hours ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

4 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago